పెళ్లి చేసుకోమని పిల్లలు ఒత్తిడి చేస్తున్నారు..!
హాలీవుడ్‌లో అందమైన జంటగా బ్రాడిపిట్, ఏంజిలీనా జోలీకి పేరు. బ్రాడ్ పిట్ తన మాజీ భార్య జెన్నిఫర్ ఆనిస్టన్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత అందాల తార ఏంజిలీనా జోలీతో 2005వ సంవత్సరం నుండి కలసి సహాజీవనం కోనసాగిస్తున్నాడు. అంతేకాదండోయ్ వీరిద్దరికి ఆరుగురు పిల్లలు కూడా ఉన్నారు. వారిలో పెద్దవాడు మాడక్స్(10)సంవత్సరాలు వయసు కాగా, ఆ తర్వాత పాక్స్(7), జహారా(6), షైలో(5) చివరగా జోలీకి ఇటీవలే కవల పిల్లలు పుట్టిన విషయం తెలిసిందే. వారిద్దరి పేర్లు నాక్స్, వివెన్నీ.
పెళ్లి చేసుకొకుండా ఇన్ని సంవత్సరాలు కలిసున్న జంటగా బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీ రికార్డ్ నెలకొల్పడమే కాకుండా, ఎన్నో సామాజిక కార్యక్రమాలలో కూడా వారి వంతు సహాయం కూడా అందిస్తుంటారు. ఐతే ఇటీవల కాలంలో వీరిద్దరూ పెళ్లి చేసుకొబోతున్నారని ఇంటర్నెట్లో రూమర్ రావడం జరిగింది. ఈ విషయంపై బ్రాడ్ పిట్‌ని ప్రశ్నించగా దానికి సమాధానమిస్తూ మా పిల్లలు అందరూ కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు పెళ్లి చేసుకొవాలని పట్టుబడడం జరిగిందని ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు.
దీనిని బట్టి ఏమి అర్దం అవుతుందంటే సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల కొరికను తీర్చడంలో ముందుంటారు. తమ పిల్లలు కొరిన కోరికను ఈ బ్రాడ్ పిట్, అందాల తార ఏంజిలీనా జోలీ దంపతులు తీరుస్తారో లేదో తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచిచూడాల్సిందే.


Click it and Unblock the Notifications











