నిశ్చితార్థం వార్త విని పిల్లలు థ్రిల్ అయ్యారు: పిట్
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ సూపర్ స్టార్స్ బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీలు ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ వార్తపై మొదటి సారి పెదవి విప్పిన బ్రాడ్ పిట్ మాట్లాడుతూ... ఈ వార్త తెలిసిన తమ ఆరు పిల్లలు ఎంతగానో సంతోషించారని బ్రాడ్ పిట్ వెల్లడించారు. బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీ పిల్లలైన మేడాక్స్(10), పాక్స్(8), జహారా(7), షిలొహ్(5), మరియు కవలలు నాక్స్వివియన్నే(3) గత కొన్ని నెలలుగా మమ్మల్ని పెళ్లి చేసుకోవాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారు.
మా పిల్లలు అలా కోరుకోవడంలో తప్పు ఏముంది. అంతేకాకుండా ఇది మా పిల్లలకు మాకు మరింత అర్థాన్నిస్తుంది. జోలీని నేను పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని గతంలోనే ప్రస్తావిద్దామని అనుకున్నప్పుడు... కొన్ని కారణాల వల్ల ఆగిపోయాను. కానీ ఇప్పుడు మేమిద్దరం జీవితాంతం కలసి ఉండగలమనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రాడ్ పిట్ తెలిపాడు.
మా పిల్లలు మమ్మల్ని ఎక్కువ బలవంతం చేయడం.. భవిష్యత్తులో వారికి ఎటువంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశ్యంతో మేమిద్దరం కలసి ఈ నిర్ణంయ తీసుకున్నాం. గురువారం ఏంజిలీనా జోలీ ఎడమ చేతికి పెద్ద వజ్రపుటుంగరాన్ని ధరించి ఉండడం చూసిన అభిమానులకు ఇటీవలే వారి నిశ్చితార్థం అయినట్లు బ్రాట్ పిట్ అధికార ప్రతినిధి సింతియా పెట్-దంతే ఇటీవలే వారి నిశ్చితార్థం అయినట్లు అధికారకంగా ధ్రువీకరించారు.
ఈ సందర్బంలో పిట్ అధికార ప్రతినిధి సింతియా పెట్-దంతే మాట్లాడుతూ 'అవును అది నిజమే. భవిష్యత్తుకు భరోసా కల్పించే ఈ నిర్ణయం పట్ల వారి పిల్లలంతా చాలా ఆనందంగా ఉన్నారు. ప్రస్తుతానికి వారి పెళ్లి తేదీ ఇంకా ఖరారు కాలేదు' అని ఆమె తెలిపారు. పెళ్లి కోసం బ్రాడ్ 2.50 లక్షల డాలర్ల విలువైన వజ్రపుటుంగరం చేయించినట్లు బెవర్లీ హిల్స్ జ్యూయలర్ రాబర్ట్ ప్రొకాప్ వెల్లడించారు. లాస్‌ఏంజెల్స్ కౌంటీ మ్యూజియంలో ఇటీవల జరిగిన చైనీస్ ఆర్ట్ కలెక్షన్ కార్యక్రమంలో తొలిసారిగా జోలీ ఆ ఉంగరంతో కనిపించారు.
పిట్, జోలీలు 2004లో మిష్టర్ అండ్ మిసెస్ స్మిత్ సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు. అప్పటికే పిట్‌కు జెన్నిఫర్ అనిస్టన్‌తో వివాహమైంది. 2005లో బ్రాడ్, ఏంజెలినాల ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది. అనంతరం బ్రాడ్ తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. ఏంజెలినాకు అప్పటికి రెండుసార్లు వివాహమైంది. ఆమె గతంలో జానీ లీ మిల్లర్, బిల్లీ బాబ్ థ్రాంటన్‌లను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం బ్రాడ్, ఏంజెలినాలకు ఆరుగురు పిల్లలున్నారు. వారిలో ముగ్గుర్ని దత్తత తీసుకోగా, మరో ముగ్గురికి జన్మనిచ్చారు.


Click it and Unblock the Notifications











