కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతో సహాయం అందించారు
హాలీవుడ్ ప్రముఖ సింగర్, హీరోయిన్ డెమి లోవాటా రియాలిటీ టివి స్టార్ కిమ్ కర్దాషియాన్‌తో ఉన్న బంధం మాటల్లో చెప్పలేదని నెమరవేసుకున్నారు. గత అక్టోబర్‌లో తన శరీరంలో వచ్చినటువంటి కొన్ని ఫిజికల్ ప్రాబ్లమ్స్‌కి డెమి లోవాటా మెడికల్ ట్రీట్‌మెంట్ కోసం రిహాబ్‌కి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సందర్బంలో కిమ్ కర్దాషియాన్ నా గురించిన సమాచారం నా అభిమానులకు ట్విట్టర్ ద్వారా అందజేయడం జరిగింది.
అంతేకాకుండా నేను ట్రీట్‌మెంట్‌కి వెళ్లినప్పుడు త్వరగా కొలుకొవాలని అభిమానులు ప్రార్దన కూడా చేయడం జరిగిందన్నారు. 19 సంవత్సరాలు వయసు కలిగిన మన డెమి లోవాటా మెడికల్ ట్రీట్ మెంట్‌కి వెళ్లడానకి గల కారణం తినే తిండిలో కొంచెం మార్పులు ఒక కారణం కాగా, మరో కారణం పర్సనల్ ప్రాబ్లమ్స్‌గా డాక్టర్స్ అభివర్ణించడం జరిగింది. ఆ తర్వాత రిహాబ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత డెమి లోవాటా జీవితంలో నేను రిహాబ్‌లో ఉన్న కొన్ని నెలలు నాకు చీకటి రోజులుగా ఉండిపోయాయని తన అభిమానులతో చెప్పారు. ఈ సందర్బంలో డెమి లోవాటా గురించిన సమాచారం సెలీనా గోమెజ్, కిమ్ కర్దాషియాన్‌లు అభిమానులతో పంచుకొవడం జరిగింది.


Click it and Unblock the Notifications











