Don't Miss!
- News నేడే లాస్ట్ ఛాన్స్, పార్టీల్లో కొత్త టెన్షన్ - పులివెందులలో జగన్..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
భర్తకు గుడ్‌బై చెప్పి.. ప్రియుడితో కిమ్ కర్దాషియన్ అఫైర్.. సీక్రెట్ రొమాన్స్ బట్టబయలు!
హాలీవుడ్లో అత్యంత ప్రేక్షకాదరణ దంపతులు కాన్యే వెస్ట్, కిమ్ కర్దాషియాన్ విడాకులకు దరఖాస్తు చేసుకోవడం అభిమానులను ఆశ్చర్యంలోకి నెట్టింది. 2014లో వివాహం చేసుకొన్న దంపతులు దాదాపు ఆరేళ్లపాటు వైవాహిక జీవితాన్ని చక్కగా అనుభవించారు. అయితే 2020 ఆరంభం నుంచి వారి మధ్య విభేదాలు చోటుచేసుకోవడంతో విడిపోవాలని నిర్ణయించుకొన్నారు. అయితే కాన్యే వెస్ట్‌తో విడాకులు తీసుకోవడానికి కిమ్‌కు కొత్తగా ఏర్పడిన అఫైర్ కారణమనే వార్త సంచలనం రేపింది. ఆ వివరాల్లోకి వెళితే..
స్టైలిష్ గా పూనమ్ బజ్వా కొత్త ఫోటోషూట్ (ఫొటోలు)
విడాకుల కోసం కిమ్ కర్దాషియాన్
అంతర్జాతీయ ర్యాపర్ కాన్యే వెస్ట్, హాలీవుడ్ నటి కిమ్ కర్దాషియాన్ గత నెల విడాకుల కోసం దరఖాస్తు చేసుకొన్నారు. అనంతరం వారిద్దరు విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందు వరకు కలబాసాస్ మ్యాన్షన్‌లో నివాసం ఉండేవారు. అయితే ప్రస్తుతం వారిద్దరూ ఉంటూనే వారి నలుగురి పిల్లల సంరక్షణ బాధ్యతను పంచుకోవాలని నిర్ణయించుకొన్నారు.
కెనడియన్ పాప్స్టార్తో డేటింగ్
అయితే కాన్యే వెస్ట్‌తో కిమ్ కర్దాషియాన్ విడిపోవడానికి కారణం ఆమెకు ఉన్న వివాహేతర సంబంధమనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. కెనడియన్ పాప్ స్టార్ డ్రేక్‌తో కిమ్ కర్దాషియన్ సంబంధం పెట్టుకొన్నట్టు వార్తలు వచ్చాయి. స్వయంగా ఇటీవల డ్రేక్ ఆ విషయాన్ని ప్రకటించడం సంచలనంగా మారింది.
కిమ్‌తో అఫైర్ అంటూ డ్రేక్ లీక్
పాస్ట్ స్టార్ డ్రేక్ ఇటీవల తన వాంట్స్ అండ్ నీడ్స్ అనే వీడియో ఆల్బమ్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా తనకు కిమ్‌కు అఫైర్ ఉందని పరోక్షంగా వెల్లడించారు. అయితే కిమ్ పేరు ఎత్తకుండా తనకు ఆమెతో అఫైర్ ఉందని స్పష్టం చేశారు. దాంతో కాన్యే వెస్ట్‌తో విడిపోవడానికి అసలు కారణం ఇదే అంటూ హాలీవుడ్ పత్రికలు కథనాలు ప్రచురించాయి.
గాఢమైన ప్రేమలో కిమ్ కర్దాషియాన్
కిమ్ కర్దాషియాన్‌తో డేటింగ్ చేస్తున్నట్టు డ్రేక్ ప్రకటించడం ఇది మొదటిసారి కాదు. గతంలో అంటే 2018 సెప్టెంబర్‌లో కూడా తన అఫైర్ విషయాన్ని బయటపెట్టారు. ట్విట్టర్లో చేసిన కామెంట్స్ అప్పట్లో వైర్ అయ్యాయి. డ్రేక్, కాన్యే ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరిని మరొకరు ఫాలో అవుతూ కామెంట్లు చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.