Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్‌వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వంట గదిలో నగ్నంగా.. ఇంటర్నెట్లో హాల్ చల్
కిమ్ కర్దాషియాన్ గురించి ఇంటర్నెట్లో వస్తున్న నగ్న చిత్రాల పుకార్లు వస్తున్న విషయం తెలిసిందే. రియాలిటీ టివి స్టార్ కిమ్ కర్దాషియాన్ నగ్న చిత్రాల కుంభకోణం గురించి వచ్చిన పుకార్లను కిమ్ కర్దాషియాన్ ప్రతినిధి తోసిపుచ్చారు. ఆ చిత్రాలలో ఉన్నది కిమ్ కర్దాషియాన్ కాదు. కానీ ఆ చిత్రాలలో ఉన్న అమ్మాయి అచ్చం కిమ్ కర్దాషియాన్ మాదిరే ఉందని కిమ్ కర్దాషియాన్ ప్రతినిధి తెలిపారు.
ప్రస్తుతం నెట్లో సంచరిస్తున్న నగ్న ఫోటో గతంలో కర్దాషియాన్ ఫోటో షూట్ కోసం వంట గదిలో చీకటిలో నిలబడి తీయించుకున్న ఓ పాత ఫోటోగా అభివర్ణించారు. ఇటీవల కాలంలో స్కేర్ లెట్ జాన్సన్, మిలా కునిస్ తదితరులకు చెందిన నగ్న చిత్రాలను హ్యాకర్లు హ్యాక్ చేసి ఇంటర్నెట్లో పెట్టిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే కిమ్ కర్దాషియాన్ హై హీల్స్‌ని ధరిస్తే తాను చాలా సెక్సీగా, హుందాగా కనిపిస్తానని తెలిపింది. ఇక వివరాల్లోకి వెళితే కిమ్ ఇటీవల కాస్మోపోలిటియన్ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ.. నేను పూర్తి మేకప్‌తో ఏదైనా ఫోటోషూట్‌లో పాల్గోన్నప్పడు తప్పని సరిగా నాకు హై హీల్స్ అవసరం ఎందుకంటే నేను హై హీల్స్ ధరించినప్పుడే సెక్సీయస్ట్‌గా కనిపిస్తానని భావిస్తాను. దీనికి కారణం లేకపోలేదు. నేను ఎత్తు తక్కువగా ఉంటాను కాబట్టి, చూసేందుకు కరెక్టుగా ఉండాలి. అందుకే హై హీల్స్‌ని ఎక్కువగా ఫోటో షూట్లలో వినియోగిస్తాను.