బెస్ట్ బర్త్ డే...కొత్త ప్రియుడితో హాట్ బ్యూటీ ఎంజాయ్
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ టివి స్టార్ కిమ్ కర్దాషియాన్, కేన్ వెస్ట్‌తో కొన్ని నెలలుగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమ ప్రేమ బంధాన్ని తర్వలో వీరు దాంపత్య బంధంగా మార్చుకోతున్నారు. కిమ్ కర్ధాషియాన్ అక్టోబర్ 21తో 32వ వసంతంలోకి అడుగుపెట్టింది. తన కొత్త ప్రియుడితో చాలా బాగా ఎంజాయ్ చేసానని, నా జీవితంలో ఇది బెస్ట్ బర్త్ డే అంటోంది కిమ్.
కిమ్ బర్త్ రోజు కేన్ వెస్ట్ ఆమె చేతికి రింగ్ తొడిగి ప్రపోజ్ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ అలా జరుగలేదు. బహుషా ఇంకొంత కాలం సహ జీవనం చేసిన తర్వాత వీరి ఎంగేజ్ మెంట్ జరుగవచ్చని అంటున్నారు. తమ ప్రేమ బంధాన్ని శాశ్వత బంధంగా మలుచుకుంటామని కిమ్ ఇప్పటికే ప్రకటించింది. శాశ్వత సంబంధం అంటే అన్న ప్రశ్నకు గాను గత ఆరు నెలలుగా నేను, కేన్ వెస్ట్ వివాహం కాకుండానే డేటింగ్ చేసుకుంటున్నాం. ఐతే ఈ బంధాన్ని వివాహం ద్వారా శాశ్వత బంధం చేయాలని అనుకుంటున్నానని బదులిచ్చారు.
31 సంవత్సరాల వయసు కలిగిన కిమ్ కర్దాషియాన్, కేన్ వెస్ట్ ఇద్దరూ గత పది సంవత్సరాలుగా ఒకరికి ఒకరు తెలుసు. ఇటీవలే కిమ్ కర్దాషియాన్ బాస్కెట్ బాల్ ఆటగాడు క్రిస్ హాంప్రస్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఐతే కొన్ని కారణాల వల్ల 72 రోజులు గడవక ముందే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నుండి కిమ్ కర్దాషియాన్, సింగర్ కేన్ వెస్ట్‌తో సన్నిహితంగా మెలుగుతున్నారు.
కేన్ వెస్ట్‌తో నా సంబంధం పదిలంగా ఉంటుందని, అందుకు కారణం రొమాన్స్ చేయడానికి ముందే మేమిద్దరం ధృడమైన స్నేహా బంధాన్ని నిర్మించుకున్నామని చెప్పారు. క్రిస్ హాంప్రస్‌ని పెళ్లి చేసుకోవడానికి ముందే కొన్ని సంవత్సరాలుగా కేన్ వెస్ట్, కిమ్‌కి మధ్య మంచి స్నేహా సంబంధాలున్నాయని.. మా ఇద్దరి మధ్య రొమాన్స్ చక్కగా ఉండేందుకు ఈ స్నేహాం అనుకూలిస్తుందని పేర్కొంది. మా ఇద్దరి గురించి మాకు బాగా తెలుసు. ఇద్దరి మనుషుల మధ్య మంచి రిలేషన్‌షిప్ కొనసాగాలంటే స్నేహం ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని తెలిపింది.


Click it and Unblock the Notifications











