»   » రేప్ చేసి చంపుతారని బయపడ్డా, పిల్లలున్నారని వేడుకున్నా... హీరోయిన్!

రేప్ చేసి చంపుతారని బయపడ్డా, పిల్లలున్నారని వేడుకున్నా... హీరోయిన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

పారిస్: అమెరికన్ టీవీ హీరోయిన్ కిమ్ కర్దాషియాన్ మీద ఇటీవల పారిస్ హోటల్ లో దోపిడి జరిగిన సంగతి తెలిసిందే. తెల్లవారుజామున కిమ్‌ గదిలోకి ఐదుగురు దుండగులు పోలీసులమంటూ చొరపడ్డారు. ముసుగులు వేసుకొని వచ్చిన వారు కిమ్‌కు తుపాకీ గురి పెట్టి.. ఆమె వద్దనున్న మిలియన్‌ డాలర్ల విలువైన నగల్ని దోచుకెళ్లారు.

ఈ ఘటనపై కిమ్ కర్దాషియాన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దుండగులు తన గదిలోకి ప్రవేశించిన వెంటనే వారిలో ఒకడు తనను బాత్ టబ్ లోకి తీసుకెళ్లి బంధించాడని, ఆ సమయంలో అతడు తనను రేప్ చేస్తాడేమోనని భయపడ్డట్లు కిమ్ తెలిపింది.

చంపుతారని భయం వేసింది

చంపుతారని భయం వేసింది

వారు అడిగింది ఇవ్వకుంటే చంపడానికి కూడా సిద్ధమయ్యారు. అందుకే తన వద్ద ఉన్న విలువైన వస్తువులు వారికి ఇచ్చేసాను. తన ప్రాణం కంటే వస్తువులు విలువైనవేమీ కాదని కిమ్ కర్దాషియాన్ తెలిపారు.

వారిని ప్రాధేయపడ్డాను

వారిని ప్రాధేయపడ్డాను

తనకు పిల్లలున్నారని, తనను చంపొద్దని ప్రాదేయ పడ్డాను. నేను వారికి ఎదురు తిరిగి ఉంటే తనను చంపేసే వారు అని కిమ్ కర్దాషియాన్ తన ఫిర్యాదులో తెలిపారు.

నెటికి టేప్ అతికించారు

నెటికి టేప్ అతికించారు

వారిని చూసిన భయంతో నేను గట్టిగా ఏడ్వటం మొదలు పెట్టగానే నా నోటికి టేప్ అతికించారు. ఐదారు నిమిషాల్లో నా వద్ద ఉన్ననగలు, డబ్బు దోచుకుని వెళ్లి పోయారు. వారు వెళ్లగానే అరిచాను. వెంటనే బాడీగార్డ్స్ వచ్చారు అని కిమ్ తెలిపారు.

ఫ్రెంచి దొంగలే

ఫ్రెంచి దొంగలే

దుండగులు ఫ్రెంచిలోనే మాట్లాడారు. వారు ఇంగ్లీషులో మాట్లడలేదు. అందుకే నాకు కొంత అర్థం కాలేదు. వారు మొహాలకు మాస్క్ వేసుకోవడం వల్ల వారిని గుర్తుపట్టలేనని కిమ్ కర్ధాషియాన్ తెలిపారు.

భారీగా నష్టం, ప్రాణాలు నిలిచాయి

భారీగా నష్టం, ప్రాణాలు నిలిచాయి

ఈ దోపిడీ ఘటనలో కిమ్ కర్ధాషియన్ దాదాపు కోట్లాది రూపాయల విలువ చేసే డబ్బు, నగలు దోచుకెళ్లారు. వీటి విలువ 10 మిలియన్ డాలర్స్ (మన కరెన్సీలో రూ. 50 కోట్ల పైనే) ఉంటుందని అంచనా.

అనుమానాలు

అనుమానాలు

అయితే ఈ దోపిడీ వ్యవహారం పై కొన్ని అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. నిజంగానే దోపిడీ జరిగిందా.... కిమ్ కావాలని నాటకం ఆడుతోందా? అనేది హాట్ టాపిక్ అయింది.

English summary
Kim Kardashian feared she was going to be raped during Paris apartment raid. Kim Kardashian was bound and robbed at gunpoint in a luxury apartment in Paris on Monday. Five armed masked men dressed as police officers were involved and stole millions of dollars in jewelry.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu