భర్తకు గుడ్‌బై చెబుతున్న కిమ్ కర్దాషియాన్.. 8 ఏళ్ల వైవాహిక జీవితానికి చెక్!
హాలీవుడ్‌లో ప్రముఖ సినీ దంపతులు విడాకులు సిద్ధమయ్యారు. నటి, కిమ్ కర్దాషియాన్, ర్యాపర్, పాప్ సింగర్ కాన్యే వెస్ట్ తమ వైవాహిక జీవితానికి గుడ్‌బై చెప్పడానికి రెడీ అయ్యారు. దాంతో కొద్దికాలంగా మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తకు బలమైన ఆధారం దొరికినట్టు స్పష్టమైంది. కిమ్, కాన్యే వైవాహిక జీవితం, విభేదాల విషయానికి వస్తే...

అధ్యక్ష ఎన్నికలకు ముందు చిచ్చు
గత కొద్దికాలంగా కిమ్ కర్దాషియన్ దంపతులు విడిపోతున్నారనే వార్త అమెరికా మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు నుంచి వారిద్దరి విడిపోవడానికి సిద్ధమయ్యారు. కాన్యే వెస్ట్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకొన్న నేపథ్యం కూడా వారిద్దరి బంధం మధ్య చిచ్చుకు కారణమైంది.

విడాకుల పిటిషన్ ఫైల్ చేసిన కిమ్
ఇలాంటి పరిస్థితుల్లో కిమ్ కర్దాషియాన్ లాయర్ లారా వాస్సెర్ ఫిబ్రవరి 19వ తేదీన విడాకులకు సంబంధించిన పిటిషన్‌ను కోర్టులో ఫైల్ చేసినట్టు సమాచారం. కిమ్, కానే దంపతులు తమ మధ్య తలెత్తిన విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి సిద్ధమయ్యారు. ఆ కారణంగా వారిద్దరి వేర్వేరుగా జీవించడానికి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకొన్నారు అని తెలిపారు.
అందాల ఆరబోత.. నైనా గంగూలీ పిక్స్ వైరల్

నలుగురు పిల్లలను తన కస్టడికీ
అయితే తన నలుగురు పిల్లలను తన కస్టడీకి అప్పగించాలని కిమ్ కర్దాషియాన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం హాలీవుడ్ వర్గాలను షాక్ గురి ేసింది. కిమ్ దంపతులకు నార్త్, చికాగో, సెయింట్, సాల్మ్ అనే నలుగురు సంతానం ఉన్నారు. అయితే పిల్లలను కిమ్‌కు అప్పగించడానికి కాన్యే కూడా ఒప్పుకొన్నట్టు తెలిసిందే.

2012లో అంగరంగవైభవంగా పెళ్లి
కిమ్ కర్దాషియాన్, కాన్యే వెస్ట్ 2012లో విలాసమంతమైన ప్రదేశంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకొన్నారు. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అత్యంత గుర్తింపు ఉన్న సెలబ్రిటీ కపుల్ జాబితాలో చేరారు. తాజాగా వారిద్దరి మధ్య కలతలు చోటుచేసుకోవడంతో 8 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయం తీసుకొన్నారు.


Click it and Unblock the Notifications











