ఆ రాత్రి ఫ్యాన్స్‌కి నిద్రపట్టకుండా చేసిన హాట్‌లేడీ
లాస్ ఏంజిల్స్: అమెరికన్ టీవీ స్టార్ కిమ్ కర్దాషియాన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తన అందచందాలతో ప్రపంచం చూపులను తనవైపు తిప్పుకున్న కిమ్ మొన్న రాత్రి అభిమానులకు నిద్ర పట్టకుండా చేసింది. ఇందుకు ట్విట్టర్‌ను వేదికగా చేసుకుని అందాల బీభత్సం సృష్టించింది.
ఎందుకనో మొన్న రాత్రి ఈ హాట్ లేడీకి నిద్ర పట్టలేదు. దీంతో చాలా సేపు ఆన్‌లైన్‌లో గడిపింది. తనకు నిద్ర పట్టనప్పుడు అభిమానులకు ఎందుకు నిద్ర పోవాలి? అనుకుందో ఏమో సైలెంట్‌గా తన ప్లాన్ అమలు చేసింది. లింగరీతో ఉన్న తన సెక్సీ ఫోటోలను ట్విట్టర్లో పోస్టు చేసింది. అసలే అందగత్తె అందులోనూ లింగరీలో ఉన్నప్పుడు హాట్ లేడీని చూస్తే అభిమానులకు నిద్ర ఎలా పడుతుంది చెప్పండి!
కిమ్ కర్దాషియాన్ బాస్కెట్ బాల్ ఆటగాడు క్రిస్ హాంప్రస్ ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్ని కారణాల వల్ల 72 రోజులు గడవక ముందే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం కిమ్ కర్దాషియాన్ కేన్ వెస్ట్‌తో డేటింగ్ చేస్తోంది. 31 సంవత్సరాల వయసు కలిగిన కిమ్ కర్దాషియాన్, కేన్ వెస్ట్ ఇద్దరూ గత పది సంవత్సరాలుగా ఒకరికి ఒకరు తెలుసు.
కేన్ వెస్ట్‌తో నా సంబంధం పదిలంగా ఉంటుందని, అందుకు కారణం రొమాన్స్ చేయడానికి ముందే మేమిద్దరం ధృడమైన స్నేహా బంధాన్ని నిర్మించుకున్నామని, మా ఇద్దరి మధ్య రొమాన్స్ చక్కగా ఉండేందుకు ఈ స్నేహాం అనుకూలిస్తుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కిమ్ కర్దాషియాన్ పేర్కొంది.


Click it and Unblock the Notifications











