కలిసి సహాజీవనం సాగించనున్న కిమ్, కేన్ వెస్ట్
లండన్, జూన్ 3: హాలీవుడ్‌లో ఎప్పుడు ఏ జంట కలుస్తారో, ఎప్పుడు ఏ జంట విడిపోతారో చెప్పడం చాలా కష్టం. ప్రేమించి పెళ్లి చేసుకోని 72 రోజులు గడవక ముందే భర్త నచ్చలేదంటూ విడాకులు తీసుకున్న కిమ్ కర్దాషియాన్.. గత మూడు నెలలుగా సింగర్ కేన్ వెస్ట్‌తో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కిమ్, కేన్ వెస్ట్ వారికి సంబంధిత గృహాలను మార్కెట్లో వేలానికి పెట్టి, ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో సహాజీవనం కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే కిమ్ కర్దాషియాన్, కేన్ వెస్ట్ ఇద్దరూ లాస్ ఏంజిల్స్‌లో ఉన్న తమ తమ ఇళ్లను వేలానికి మార్కెట్లో పెట్టి, ఇద్దరూ కలిసి ఓ అందమైన ఇంటి కోసం వెతుకులాట ప్రారంభించారు. వీరిద్దరూ కలిసి పయనించడానికి, సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. వారు అనుకున్నట్లు పనులన్నీ వేగంగా జరిగితే త్వరలోనే కిమ్ మరియు కేన్ వెస్ట్ కలిసి ఒక కొత్త ఇల్లు అద్దెకు తీసుకుంటారని కిమ్ అధికార ప్రతినిధి తెలిపారు.
ప్రస్తుతానికి వీరు ఇంటిని కోనే ఉద్దేశ్యంతో లేరు. ఇద్దరూ కలిసి కొన్నాళ్లు సహాజీవనం సాగించేందుకే ఈ ఇంటిని ఉపయోగించనున్నారు. కాలం కలిసి వస్తే ఫ్యామిలీని పెట్టేందుకు సిద్దంగా ఉన్న తరుణంలో ఇంటిని కొనుగోలు చేస్తారు. బేవరి హిల్స్‌లో ఉన్న తన విల్లాని కిమ్ కర్దాషియాన్ $5 మిలియన్ కు అమ్మనున్నట్లు తెలుపగా.. కేన్ వెస్ట్ తన హాలీవుడ్ హిల్స్ ని బేరానికి పెట్టాడు.


Click it and Unblock the Notifications











