హాట్ బ్యూటీ వివాహం, భర్తను ముద్దాడింది (ఫోటోలు)
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ టివి స్టార్ కిమ్ కర్దాషియాన్, సింగర్ కేన్నీ వెస్ట్‌తో కొన్ని నెలలుగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి ముందే వీరు ఒక బిడ్డకు అమ్మానాన్నలు అయ్యారు. తాజాగా ఈ స్టార్స్ పెళ్లాడారు. ఇటలీలో వీరి వివాహం అతిథులు, సన్నిహితుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది.
తాజాగా వీరి వివాహానికి సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు విడుదలయ్యాయి. తెలుపు రంగు గౌనులో కిమ్ కర్దాషియాన్ ఎంతో అందంగా మెరిసి పోయింది. ఇక కెన్నీ వెస్ట్ సంప్రదాయ వెడ్డింగ్ సూట్ ధరించారు. వివాహం సందర్భంగా అతిథుల కోసం ప్రత్యేకమైన విందు ఏర్పాటు చేసారు.
వెడ్డింగ్ అనంతరం ఇద్దరూ ముద్దాడుకున్న సందర్భంగా హైలెట్‌గా నిలిచింది. అతిథులంతా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ అభినందించారు. వివాహానికి సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

కిమ్ కర్దాషియాన్, కెన్నీ వెస్ట్
కిమ్ కర్దాషియాన్, కెన్నీ వెస్ట్ వెడ్డింగ్ దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు. తెలుగు రంగు గౌనులో కిమ్, సాంప్రదాయ సూట్లో కెన్నీ వెస్ట్ దర్శనమిచ్చారు.

వెడ్డింగ్ కిస్
వివాహం సందర్భంగా కిమ్ కర్దాషియాన్, కెన్నీ వెస్ట్ వెడ్డింగ్ కిస్.

ఏంజిల్ లుక్
తెలుగు రంగు పెళ్లి గౌనులో కిమ్ కర్దాషియాన్ ఏంజిల్‌లా మెరిసి పోయిందని ఆమె అభిమానులు అంటున్నారు.

పెళ్లికి ముందే తల్లిదండ్రులయ్యారు
పెళ్లికి ముందే కిమ్ కర్దాషియాన్, కెన్నీ వెస్ట్ తల్లిదండ్రులు అయ్యారు.


Click it and Unblock the Notifications











