వారిద్దరూ మళ్లీ కలసిపోతున్నారా??
అన్నీ సమస్యలనూ కాలమే పరిష్కరిస్తుందని అంటారు. కాలమే అన్ని గాయాలను మాన్పుతుందని అనే మాట తిరిగి వీరిద్దరి విషయంలో రుజువయింది. వారే హాలీవుడ్ హాట్ సెక్స్ సింబల్ కిమ్ కర్ధాషియాన్, రెగ్గీ బుష్ లు. కొన్నాళ్ల ముందు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీరిద్దరూ ప్రస్తుతం ఎడమొహం పెడమొహంగా వుంటున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు వీరిద్దరూ తిరిగి కలసిపోనున్నారట. ఈ విషయాన్ని స్వయంగా కిమ్ దృవీకరించింది. ఇంత కాలం తన సోదరితో కలసి వున్న కిమ్, తన చెల్లికి ఇటీవలే పెళ్లి జరగటంతో ఏకాకి అయిపోయిందట. దీంతో తిరిగి తన చెలికాడి సరసన చేరడానికి ప్రయత్నిస్తోందట.
కానీ ఇప్పుడు తాను ఒంటరి అయిపోవడం వల్ల తిరిగి తన ప్రియుడి వద్దకు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నానడం సబబు కాదని కిమ్ అంటోంది. ఏది ఎలా వున్నా కిమ్ ఇటీవల వీలుచిక్కినప్పుడల్లా తన మాజీ ప్రియున్ని పొగడటం చూస్తుంటే త్వరలోనే వీరు ఒకటి కాబోతున్నారన్న అన్న వార్త నిజమనే అనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











