ఆకుపచ్చ డ్రస్సులో అందాలను ఎరగా అభిమానులకు..
కిమ్ కర్దాషియాన్ ఈ పేరు హాలీవుడ్ పరిచయం ఉన్న వ్యక్తులకు బాగా సుపరిచితం. 30 సంవత్సరాల వయసు కలిగిన కిమ్ కర్దాషియాన్ ఇటీవలే ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. న్యూయార్క్‌లో జరిగిన మిధోరి గ్రీన్ పార్టీలో బ్యాట్‌మెన్ సినిమాలో బ్యాట్‌మెన్ శత్రువుగా నటించే 'పాయిజన్ లెవీ' డ్రస్సు ధరించి అక్కడున్న వారందరిని అలరించారు. అంతేకాకుండా కిమ్ కర్దాషియాన్ ధరించిన హాలోవీన్ డ్రస్సుకి గాను 'బెస్ట్ సెలబ్రిటీ' అవార్డుని సైతం కైవసం చేసుకున్నారు.
ప్రక్క చిత్రంలో గనుక చూసినట్లైతే కిమ్ కర్దాషియాన్ ధరించిన డ్రస్సుని మీరు గమనించవచ్చు. కిమ్ కర్దాషియాన్ ఈ డ్రస్సు ధరించడానికి గల కారణం పుదీన వాసన వచ్చేటటువంటి మందు బ్రాండ్‌ని ప్రోత్సహించడానికి ఈ డ్రస్సులో వచ్చారు. అంతేకాకుండా ఆమె ఆకుపచ్చ రంగు కలిగిన డ్రస్సు మాదిరి ధరించడం వెనుక ఉన్న రహాస్యం కూడా అదేనని అంటున్నారు.
ఈ డ్రస్సులో కిమ్ కర్దాషియాన్ అందాలు చూపరులను బాగా ఆకట్టుకున్నాయి. కిమ్ కర్దాషియాన్ ధరించిన పాయిజన్ లెవీ డ్రస్సులో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే తలపై ఆమె వేసుకున్న ఎరుపు రంగు. దీంతో కిమ్ కర్దాషియాన్ అందాలు చూసేందుకు మరింత అందంగా కనిపించడమే కాకుండా అక్కడున్న వారంతా కిమ్‌కి అభిమానులై పోయారు.


Click it and Unblock the Notifications











