ప్రియుడితో డేటింగ్-గర్భవతైన హాట్ లేడీ
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ నటి, టివి స్టార్ కిమ్ కర్దాషియాన్ తన ప్రియుడు, ప్రముఖ సింగర్ కేన్ వెస్ట్‌తో కొన్ని నెలలుగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోవాలనే యోచనలో ఉన్నాయి. అయితే అంతకు ముందే ఇద్దరూ తొందర పడ్డారు. ఫలితంగా కిమ్ కర్ధాషియాన్ గర్భం దాల్చింది.
ఈ విషయాన్ని సింగర్ కేన్ వెస్ట్ స్వయంగా ఓ కార్యక్రమం స్టేజీ షోలో వెల్లడించారు. కిమ్ కర్దాషియాన్ సన్నిహితుల నుంచి అందిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆమె 12 వారాల గర్భవతి అని తెలుస్తోంది. 32 సంవత్సరాల వయసు కలిగిన కిమ్ కర్దాషియాన్, కేన్ వెస్ట్ ఇద్దరూ గత పది సంవత్సరాలుగా ఒకరికి ఒకరు తెలుసు. ఇటీవలే కిమ్ కర్దాషియాన్ బాస్కెట్ బాల్ ఆటగాడు క్రిస్ హాంప్రస్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఐతే కొన్ని కారణాల వల్ల 72 రోజులు గడవక ముందే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.
ఆ తర్వాత నుండి కిమ్ కర్దాషియాన్, సింగర్ కేన్ వెస్ట్‌తో డేటింగ్ చేస్తోంది. కేన్ వెస్ట్‌తో నా సంబంధం పదిలంగా ఉంటుందని, అందుకు కారణం రొమాన్స్ చేయడానికి ముందే మేమిద్దరం ధృడమైన స్నేహా బంధాన్ని నిర్మించుకున్నామని చెప్పారు. క్రిస్ హాంప్రస్‌ని పెళ్లి చేసుకోవడానికి ముందే కొన్ని సంవత్సరాలుగా కేన్ వెస్ట్, కిమ్‌కి మధ్య మంచి స్నేహా సంబంధాలున్నాయి.
కేన్ తో కొత్త సంబంధాన్ని ఏర్పరుచుకోవడంపై కిమ్ కర్దాషియాన్ స్పందిస్తూ...మా ఇద్దరి మధ్య రొమాన్స్ చక్కగా ఉండేందుకు మా మధ్య ఉన్న స్నేహాం అనుకూలిస్తుందని పేర్కొంది. మా ఇద్దరి గురించి మాకు బాగా తెలుసు. ఇద్దరి మనుషుల మధ్య మంచి రిలేషన్‌షిప్ కొనసాగాలంటే స్నేహం ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని చెప్పుకొచ్చింది. త్వరలో ఈ జంటన పెళ్లి చేసుకోబొతున్నారు. అయితే కిమ్ డెలివరీ అయ్యాక వీరి పెళ్లి ఉంటుందా? అంతకంటే ముందే ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











