పిల్లల్ని కనడానికి ఇక సిద్దం అంటున్న స్టార్ హీరోయిన్
హాలీవుడ్ సెక్సీ హీరోయిన్, సోషియోలైట్ కిమ్ కర్దాషియాన్ ఇటీవలే ఎంతో అంగరంగ వైభవంగా అచ్చం బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్స్ మాదిరే అత్యంత ఖరీదైన పెళ్లిని తను ప్రేమించిన బాస్కెట్ బాల్ ప్లేయర్ క్రిస్ హాంప్రస్‌ని చేసుకున్న విషయం తెలిసిందే. కిమ్ కర్దాషియాన్‌కి పిల్లలంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని పలు సందర్బాల్లో వెల్లడించడం జరిగింది. ఇప్పుడు కిమ్ కర్దాషియాన్ పిల్లల్ని కనడానికి సిద్దంగా ఉందంటూ అది కూడా ఎక్కువ మంది పిల్లల్ని కని తన ఫ్యామిలీని బాగా వృద్ది చేస్తుందని తనకు అత్యంత సన్నిహిత వర్గాల వారు వెల్లడిస్తున్నారు.
ఈ విషయంపై స్పందించిన కిమ్ కర్దాషియాన్ నేను కూడా పిల్లలను కనడానికి ఆసక్తిని చూపిస్తున్నాను. ఎందుకంటే పిల్లలకు ఒక తల్లిగా ఉండడం అనేది పూర్వ జన్మ సుకృతం అని అన్నారు. అందులో ఏదో స్పెషల్ ఉంటుంది. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడూ కూడా వారికి చాలా దగ్గరగా ఉండాలని కోరుకుంటాను. అలాంటి అవకాశం నాకు ఇప్పుడు వస్తుంటే నేను ఎందుకు పొగొట్టుకుంటానని తన మనసులో ఉన్న ఫ్యామిలీ గురించి తెలిపారు.
రియాలిటీ టివీ స్టార్ అయిన కిమ్ కర్దాషియాన్ ప్రస్తుతానికి క్రిస్ హాంప్రస్ భార్యగా ఉండడం చాలా ఎంజాయ్ చేస్తున్నానని అన్నారు. నిజంగా ఒకరికి భార్యగా ఉండడంలో చాలా ఆనందం ఉంది. నేను గతంలో క్రిస్ హాంప్రస్‌తో ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అదే తరహాగా అతనితో డేటింగ్ నా ఫీలింగ్స్ అన్ని పంచుకుంటున్నానని అన్నారు.


Click it and Unblock the Notifications











