ఈజిప్ట్ యువరాణి క్లియోపాత్రా మాదిరి ఫోజులిచ్చిన రియాలిటీ టివి స్టార్
రియాలిటీ టివి స్టార్ కిమ కర్దాషియాన్ ఫిజిక్ చూసిన వారు ఎవరైనా ఇష్టపడని వారుండరంటే నమ్మండి. అంత అందం ఆమె సోంతం. ఇది మాత్రమే కీపింగ్ విత్ కర్దాషియాన్స్ అనే రియాలిటీ టివి షో ద్వారా తన కంటూ ప్రత్యేకంగా అభిమానులను సంపాదించుకున్నారు కిమ్ కర్దాషియాన్. అలాంటి కిమ్ కర్దాషియాన్ ఏమి చేసినా అదోక పెద్ద విషయం. ఇటీవల కాలంలో కిమ్ కర్దాషియాన్ హార్పర్స్ బజార్ అనే మ్యాగజైన్ కోసం పూర్వ కాలంలో ఈజిప్టు యువరాణి అయినటువంటి ఎలిజిబెత్ టేలర్ క్లియోపాత్రా మాదిరి దుస్తులు ధరించి ఫోటో ఫోజులు ఇవ్వడం జరిగింది.
ఈ ముఫ్పయి సంవత్సరాల రియాలిటీ టివి స్టార్ సోఫా పై పడుకోని తన యొక్క అందమైన శరీర వంపులను చూపిస్తూ ఫోటోలకు ఫోజు లివ్వడం జరిగింది. కిమ్ కర్దాషియాన్ ధరించినటువంటి డ్రస్సు జంతువుల చర్మంతో తయారు చేయబడింది. ఈ యాడ్ క్యాంపెయిన్ లో పాల్గోనడానికి ముందు కిమ్ కర్దాషియాన్ తన యొక్క బాడీ షేపులను చెక్కుచెదరకుండా చాలా అందంగా మెయింటేన్ చేస్తూ రావడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా యాడ్ కోసం కొన్ని ప్రత్యేక శ్రధ్దలు కూడా తీసుకోవడం జరిగిందని వివరించారు.
ముఖ్యంగా అలాంటి బాడీ షేప్ రావడం కోసం డైట్‌ని కూడా మెయింటేన్ చేశారని కిమ్ కర్దాషియాన్ తన మాటల్లోనే వెల్లడించారు. తనకి చాక్ లెట్ల్స్, ఐస్ క్రీమ్స్ లాంటివి తినడం బాగా ఇష్టమైనా కూడా ఈ యాడ్ క్యాంపెయిన్ లో పాల్గోనడం కోసం వాటన్నింటికి కొన్నాళ్శు స్వస్తి చెప్పానని అన్నారు. ఇక ఈయాడ్ చూసినటువంటి కిమ్ కర్దాషియాన్ అభిమానులు మాత్రం కిమ్ చూసి అచ్చం ఈజిప్టు యువరాణి ఎలిజిబెత్ టేలర్ క్లియోపాత్రా మాదిరే ఉందని తెగ మురిసి పోతున్నారంట.


Click it and Unblock the Notifications











