ట్విట్టర్‌లో 'ఫెర్పూమ్' యాడ్ క్యాంపెయిన్ శభాష్
రియాలిటీ టీవి స్టార్ కిమ్ కర్దాషియాన్ అభిమానుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన తన నాల్గవ ఫెర్పూమ్(పన్నీరు) 'ట్రూ రిఫ్లెక్షన్'ని ఈ సంవత్సరం విడుదల చేయనుంది. 31 సంవత్సరాల వయసు కలిగిన కిమ్ కర్దాషియాన్ గతంలో కిమ్ కర్దాషియాన్, కిమ్ కర్దాషియాన్ గోల్డ్, కిమ్ కర్దాషియాన్ లవ్ అనే మూడు సెంట్‌లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మూడింటికి కొనసాగింపుగా ఇప్పడు నాల్గవ సెంట్‌ని విడుదల చేస్తుంది.
నాల్గవ సెంట్ విడుదల సందర్బంగా దీనికి సంబంధించిన పూర్తి ప్రచారాన్ని ఈపాటికే కిమ్ కర్దాషియాన్ పూర్తి చేసింది. దీని ప్రచారం కోసం కిమ్ ప్రత్యేకంగా శ్రద్దను తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని కిమ్ స్వయంగా తన మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో 'ట్రూ రిఫ్లెక్షన్' ఫెర్పూమ్‌కు సంబంధించిన ఇమేజిని పోస్ట్ చేసింది.
ఈ ఇమేజి క్రింద కిమ్ తన యాడ్ క్యాంపెయిన్ వివరాలతో పాటు, నాకు ఎర్రని పెదాలంటే ఇష్టం. గతంలో నేను విడుదల చేసిన సెంట్స్‌తో పోల్చితే ఈ ఫెర్పూమ్ కొత్తగా ఉంటుందని అన్నారు. కిమ్ కర్దాషియాన్ ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త క్రిస్ హాంప్రస్‌కు 72 రోజుల పూర్తి అయిన వెంటనే విడాకుల కొసం కొర్టుని ఆశ్రయించడం జరిగింది. ఆ తర్వాత అక్టోబర్‌లో వీరిద్దరూ కోర్టు విధి విధానాలకు లోబడి విడాకులు తీసుకోవడం జరిగింది.


Click it and Unblock the Notifications











