బాడీగార్డ్‌తో పంచుకున్న పడకగది అనుభవాలు రియాలిటీ టివి షోలో...
కిమ్ కర్దాషియాన్ నిర్వహించేటటువంటి రియాలిటీ టివి షో కోర్ట్నిఅయిన అండ్ కిమ్ టేక్ న్యూయార్క్ లో వచ్చేవారం కిమ్ కర్దాషియాన్ మాజీ ఆస్ట్రేలియా బాడీగార్డ్ షీన్గో డీనీతో కలసి నిద్రపోయినటువంటి కొన్ని రోమాంటిక్ సన్నివేశాలను ఓ ఎపిసోడ్‌గా వేయనున్నట్లు సమాచారం. ఇక వివరాల్లోకి వెళితే న్యూయార్క్ లోని కిమ్ కర్దాషియాన్ అపార్ట్ మెంట్‌లో ఒకరోజు కిమ్ కర్దాషియాన్ మరియు ఆమె మాజీ బాడీగార్డ్ ఒకే మంచం మీద నిద్రపోవడం జరిగింది. ఆరోజు అలా జరగడానికి కారణాలు ఏంటనేవి ఓ ధారావాహికగా కిమ్ కర్దాషియాన్ తన రియాలిటీ టివి షోలో వేయడానికి సిద్దమైనట్లు తెలిపారు.
ఇది మాత్రమే కాకుండా ఆరోజు రాత్రి వారిద్దరి మద్యా జరిగినటువంటి కొన్ని రాంచీ సీన్స్‌ని కూడా ప్రసారం చేయనున్నట్లు సమాచారం. అసలు వీరిద్దరి బంధం ఎక్కడ బలపడిందని అనుకుంటున్నారా.. కిమ్ కర్దాషియాన్ పోయిన సంవత్సరం సిడ్నీనగరాన్ని చూడడానికి వెళ్శినప్పుడు వీరిద్దరి మద్య పరిచయం ఏర్పడడం, ఆతర్వాత షీన్గో డీనీ ఈమెయిల్స్ ద్వారా హాలో అంటూ పరిచయం పెంచుకోవడం జరిగింది.
ఆతర్వాత షీన్గో డీనీ ఎత్తు, అందాన్ని చూసి కిమ్ కర్దాషియాన్ సెక్సీయస్ట్ పర్సన్ ఆఫ్ ఆస్ట్రేలియాగా అభివర్ణించడం జరిగింది. అటు తర్వాత షీన్గో డీనీని తన బాడీగార్డ్‌గా నియమించుకోవడం చకాచకా జరిగిపోయాయి. ఇప్పటికీ కూడా వీరిద్దరి మద్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రూమర్స్ వస్తుంటాయి.


Click it and Unblock the Notifications











