ట్రంప్‌కు కిమ్ కర్దాషియాన్ దిమ్మ తిరిగే షాక్.. అధ్యక్ష పదవి రేసులో నిలిచిన భర్తకు గ్రీన్ సిగ్నల్

అమెరికా అధ్యక్ష పదవికి జరిగే అభ్యర్తి ఎంపిక పోటీ బరిలో దూకిన ర్యాపర్ కాన్యే వెస్ట్‌కు రోజు రోజుకు బ్రహ్మండమైన సపోర్ట్ లభిస్తున్నది. అమెరికాలో గాయకుడిగా విశేషమైన అభిమానుల ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు మనసులోని మాటను బయటపెట్టని కాన్యే వెస్ట్ తాజాగా పోటీపై క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటి వరకు వీరాభిమానిగా ఉన్న ట్రంప్‌కు కాన్యే భారీ ఝలక్ ఇవ్వడం అమెరికా రాజకీయాల్లో ఓ కుదుపుకు కారణమైంది. వివరాల్లోకి వెళితే..

ట్రంప్‌కు గతంలో ఫుల్ సపోర్ట్

ట్రంప్‌కు గతంలో ఫుల్ సపోర్ట్

గతంలో జరిగిన అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్‌కు కాన్యే వెస్ట్ బహిరంగ మద్దతు తెలిపారు. ఎన్నికల్లో ట్రంప్‌కు ఓటేయాలని అభిమానులకు పిలుపునిచ్చి ప్రచారం చేశారు. ఆ తర్వాత ట్రంప్ శ్వేతభవనంలోకి అడుగుపెట్టిన తర్వాత తన భార్య, హాలీవుడ్ హీరోయిన్ కిమ్ కర్దాషియన్‌తో కలిసి మర్యాదపూర్వకంగా కలిసి ట్రప్ చేస్తున్న అభివృద్ధిపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఎలాన్ మస్క్ సపోర్ట్‌తో

ఎలాన్ మస్క్ సపోర్ట్‌తో

ఇప్పుడు నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ మొదలు కాబోతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో గాయకుడు కాన్యే వెస్ట్ ఎన్నికల బరిలోకి దూకితే తాను మద్దతిస్తానని స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ట్విట్ చేయడంతో అమెరికాలో రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకొన్నాయి. కాన్యేకు మద్దతుగా నిలుస్తామని పలువురు ముందుకు రావడంతో పరిస్థితులు ఊహించని విధంగా మారిపోయాయి.

అధ్యక్ష పదవికి పోటీపై కాన్యే వెస్ట్ క్లారిటీ

అధ్యక్ష పదవికి పోటీపై కాన్యే వెస్ట్ క్లారిటీ

ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతు ఇచ్చేది లేదని కాన్యే వెస్ట్ స్పష్టం చేశారు. ట్రంప్ పోటీలో లేకుంటే నేను రిపబ్లికన్ అభ్యర్థిగా ఉంటాను. లేకపోతే నేను స్వతంత్ర అభ్యర్తిగా పోటీలో ఉంటానని అన్నారు. అయితే కాన్యే ప్రకటన తర్వాత ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ.. నాకు ఆయన మద్దతు ఎప్పటికీ ఉంటుంది. ఆయన తన కోసం కాకుండా మా కోసం కూడా ఉంటారు. ఆయన భార్య కిమ్ కర్దాషియాన్ మాకు సపోర్ట్‌ ఇస్తారు అనడం మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.

నా మద్దతు ట్రంప్‌కు కాదు.. నా భర్తకే

నా మద్దతు ట్రంప్‌కు కాదు.. నా భర్తకే

తన భర్త కాన్యే రాజకీయ ప్రవేశంపై ఇప్పటి వరకు పెదవి విప్పని కిమ్ కర్దాషియాన్ తాజాగా తన మనసులోని మాటను బయటపెట్టారు. కాన్యేకు తన మద్దతు ఉంటుందని బహిరంగ ప్రకటన చేశారు. అంతేకాకుండా ఓ వీడియోను రిలీజ్ చేసి.. ప్రజలందరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కోరారు. ఇప్పటి వరకు మధ్యస్థంగా ఆలోచించాను. కానీ ప్రస్తుతం కాన్యేకు అండగా నిలువాల్సిన అవసరం ఏర్పడింది అని కిమ్ తెలిపారు. దీంతో ట్రంప్ పెట్టుకొన్న ఆశలు ఆవిరి అయ్యాయనే మాట వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X