అమ్మ కావాలనుకుంటున్న సెక్సీ స్టార్
అమెరికా సెక్సీ మోడల్, బుల్లి తెర నటీమణి కిమ్ కర్దాషియాన్ తాను తల్లిని కావాలని ఉవ్విలూరుతోందట. ఈ ఆవిడే అమెరికా 'ఓకే' పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో చెప్పింది. తనకా కోరిక కలగటానికి కారణం తన సోదరి అని కూడా చెప్పుకొచ్చింది. హాట్ మోడల్ గా లైమ్ లైట్ లో వెలుగొందుతున్న ఈమెకు ఇప్పుడిలాంటి కోరిక కలిగిందేంటి అని ఆశ్చర్యపోతున్నారు విన్నవారంతా. కానీ అసలు సంగతేంటంటే తన సోదరి కౌర్ట్నీ పిల్లలను చూసుకోవడంలో కొన్నాళ్లు కిమ్ సాయం చేసిందట. అప్పటి రోజులను తానెంతో ఆశ్వాదించిందట. దాంతో తాను కూడా తల్లిని కావాలని ఆశ పడుతోందట. కోరికైతే బాగుంది కానీ ఆమె పెళ్లి చేసుకొని తల్లి కావాలనుకుంటోందో లేక ఏంజలీనా జోలీలాగా అనాధ పిల్లలను దత్తతకు తీసుకుంటుందో మాత్రం చెప్పలేదు...
కిమ్ కర్దాషియాన్ వాషింగ్టన్ కౌర్ట్నీ ఓకే మ్యాగ్జయిన్ అమెరికా kim kardashian washington kourtney ok magazine america


Click it and Unblock the Notifications