ఉల్లిపొర గౌనులో...లోదుస్తులు కనిపించేలా హాట్‌బ్యూటీ ఎంట్రీ!
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ నటి, టివి స్టార్ కిమ్ కర్దాషియాన్ ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత బాగా లావెక్కిపోయిన సంగతి తెలిసిందే. అయితే బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే లావు తగ్గించుకుని అందంగా తయారయ్యే ప్రయత్నంలో పడ్డ కిమ్ ఏకంగా 50 పౌండ్ల బరువు తగ్గింది. బరువు తగ్గి సెక్సీలుక్‌లోకి వచ్చిన ఆమె.....ఓ నైట్ టీవీషోలో పాల్గొంది.
ఈ షోకు కిమ్ కర్ధాషియాన్ ఉల్లి పొరలాంటి తెలుపు రంగు గౌనులో....లోపల వేసుకున్న నలుపురంగు లోదుస్తులు కనిపించేలా ముస్తాబై అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆమె ఇలాంటి డ్రెస్సులో ఈ షోకు రావడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఈ డ్రెస్సులో ఆమె ఎంతో సెక్సీగా ఉందంటూ పొగిడేస్తున్నారు ఆమె అభిమానులు.

కిమ్ కర్దాషియాన్ తన ప్రియుడు, ప్రముఖ సింగర్ కేన్ వెస్ట్‌తో కొన్ని నెలలుగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోవాలనే యోచనలో ఉన్నారు. అయితే అంతకు ముందే ఇద్దరూ తొందర పడ్డారు. ఫలితంగా కిమ్ కర్ధాషియాన్ గర్భం దాల్చింది. ఇప్పుడు ఆమె ఒక బిడ్డకు తల్లి కూడా.
పాశ్చాత్య సంస్కృతిలో పెళ్లి అనే అంశానికి పెద్దగా విలువ లేదు. అందుకే కిమ్ కర్ధాషియాన్-కేన్ వెస్ట్ పెళ్లి చేసుకోకుండానే లైప్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల ఆమె తన ప్రియుడికి ఆనందం కలిగించడానికి వైట్ స్విమ్ సూట్ ఫోటోను తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేసింది. అఫ్ కోర్స్ ఫోటో కేవలం ఆమె ప్రియుడి కోసం మాత్రమ కాదు....అభిమానుల కోసం కూడా.


Click it and Unblock the Notifications











