twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాయల్ వెడ్డింగ్‌లా పెళ్లి చేసుకుంటున్న సెక్సీ హీరోయిన్

    By Nageswara Rao
    |

    హాలీవుడ్ సోషియోలైట్ సెక్సీ హీరోయిన్ కిమ్ కర్దాషియాన్ తనకు కాబోయే భర్త క్రిస్ హాంప్రస్‌తో పెళ్శి పనులలో బిజీగా ఉంది. ఈ పెళ్శికి ముందు నిశ్చితార్దం జరిగిన రోజున కిమ్ కర్దాషియాన్ చేతికి సుమారుగా $2 మిలియన్‌ విలువ కలిగినటువంటి 20 కారెట్స్ డైమండ్ రింగ్‌ని తోడిగిన విషయం అందరికి తెలిసిందే. నిశ్ఛితార్దం తర్వాత ఇంకేముంది పెళ్శే కదా.. ఆ సుమూర్తపు గడియ కూడా కేవలం నెలరోజులకు రావడంతో ఇద్దరూ కూడా పుల్ బిజీగా ఉన్నారు. ఇంతకీ ఎప్పుడా వీరి పెళ్శిరోజు అని అనుకుంటున్నారా..

    కిమ్ కర్దాషియాన్, క్రిస్ హాంప్రస్‌ల పెళ్శిరోజు ఆగస్టు 20న అంగరంగ వైభవంగా చేసుకోవాలని ఇద్దరూ ప్లాన్ చేసుకున్నారు. ఈ పెళ్శికి కిమ్ సుమారు 1000 మంది అతిధులను ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఈ పెళ్శికి చాలా మంది గ్లామర్ హీరోలు, హీరోయిన్స్, పోలిటికల్ లీడర్స్ హాజరవనున్నట్లు తెలిసింది. పెళ్శికి ఆహ్వానించే విధానంలో కూడా కిమ్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. కిమ్ కర్దాషియాన్ వెడ్డింగ్ ఇన్విటేషన్‌లో ప్రచురించిన దాని ప్రకారం కాలిపోర్నియాలోని మోంటిసిటోలో తను క్రిస్ పెళ్శి చేసుకోబోతున్నట్లుగా ప్రదేశాన్ని ప్రచురించింది. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే పెళ్శికి వచ్చేటటువంటి అతిధులు అందరూ తప్పనిసరిగా బ్లాక్ టైని ధరించిరావాలని కండిషన్ పెట్టింది.

    అంతేకాకుండా సాధారణంగా రియాలిటీ టివి స్టార్ అయిన కిమ్ కర్దాషియాన్ వెడ్డింగ్ డేని ప్రత్యేకంగా టివిలో రెండు గంటలపాటు లైవ్ షో‌గా వేయనున్నారు. ఈ సందర్బంలో టివి యాజమాన్యం సిబ్బింది మాట్లాడుతూ కిమ్ కర్దాషియాన్ చెల్లెలు కోల్ కర్దాషియాన్ మ్యారేజి రోజను సుమారుగా 2009లో టివిలో ప్రదర్శించనప్పుడు 3మిలియన్ జనాభా చూడడం జరిగింది. ఇప్పుడు కిమ్ వెడ్డింగ్ ఫంక్షన్‌‌ని అంతకంటే ఎక్కువ మంది చూస్తారని మా అభిప్రాయం అని అన్నారు. సాధారణంగా పెళ్శి అంటే గుర్తుకు వచ్చేది పెళ్శికూతురు వేసుకోని వచ్చేటటువంటి డ్రస్సు మీదనే అందరి కళ్లు ఉంటాయి.

    ఇక కిమ్ కర్దాషియాన్ కూడా పెళ్శి కూతురు ధరించేటటువంటి గౌనుని న్యూయార్క్ లోని వీరా వాంగ్ స్టోరీ నుండి కొన్నిరోజులకు ముందే కోనుగోలు చేయడం జరిగింది. పెళ్శికి మొత్తం ఖర్చు కిమ్ కర్దాషియాన్ సుమారు $20 మిలియన్లు ఖర్చు పెట్టనున్నారు. ఇటీవల లండన్‌లో కేట్ మిడిల్టన్, ప్రిన్స్ విలియన్స్ ల పెళ్శికి ఖర్చు పెట్టిన దానితో పోల్చితే కిమ్ కర్దాషియాన్ మూడవ వంతు ఖర్చు పెడుతున్నారని తెలుస్తుంది. సో కిమ్ కూడా తన పెళ్శిని రాయల్ వెడ్డింగ్ లాగే జరుపుకుంటున్నారని తెలుస్తుంది.

    English summary
    Kim Kardashian has been busy planning her wedding since Kris Humphries slid the incredible $2 million, 20-carat diamond ring on her finger in May. And now their big day is less than a month away!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X