విడాకుల బాధ నుండి ఉపశమనానికి విగ్ షాపుకెళ్లిన సెక్సీ తార
లండన్: సెక్సీ హీరోయిన్ కిమ్ కర్దాషియాన్ తన మాజీ భర్త క్రిస్ హాంప్రస్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత ఆ బాధ నుండి కోలుకునేందుకు ఒక ప్రత్యేక మార్గాన్ని ఎంచుకుంది. ఆ ప్రత్యేక మార్గం ఏమిటంటే విగ్‌ను కోనుగోలు చేసేందుకు షాపింగ్‌కు వెళ్లింది. కిమ్ కర్దాషియాన్ చెల్లెలు ఇచ్చిన సలహా మేరకే ఇలా చేసింది. కిమ్ కర్దాషియాన్ చెల్లెలు కోల్ కర్దాషియాన్ విడాకులు లభించినందుకు బాధతో ఇతరుల నుండి దూరంగా వెళ్లక ఆనందించమని సలహా ఇచ్చింది.
ఇటీవల కర్దాషియాన్ సిస్టర్స్ టివి షో అయిన 'కీపింగ్ అప్ విత్ ద కర్దాషియాన్స్' లో కిమ్ కర్దాషియాన్ మాట్లాడుతూ నా విడాకులు నిజంగా ఒత్తిడితో కూడిన, బాధపెట్టే విధంగా చెయ్యబడ్డాయని తెలిపింది. నా జీవితం నుండి ఆ చాఫ్ట్రర్‌ని తొలిగిస్తున్నానని చెప్పింది. ఇదే టివి షోలో కిమ్ ప్రక్కనే ఉన్న తన చెల్లెలు కోల్ కర్దాషియాన్ దాని గురించి బాధపడకు. మనకు అధ్బుతమైన జీవితం ఉంది. దానిని సంతోషంగా ఎంజాయ్ చేయమని సలహా ఇచ్చింది.
ఆ తర్వాత నుండి కిమ్ కర్దాషియాన్ టీవి షోలో తనదైన శైలిలో రెచ్చిపోతూ రోజుకో విగ్‌ని ధరించి షో ని హైలెట్ చేస్తున్నారు. ఆగస్టు 2011లో బాస్కెట్ బాల్ ప్లేయర్ క్రిస్ హాంప్రస్‌ని ప్రేమించి అంగ రంగ వైభవంగా పెళ్లి చేసుకున్న కిమ్ కర్దాషియాన్ కొన్ని అనుకోని కారణాల వల్ల విడిపోయారు. దీంతో కిమ్ ప్రస్తుతం రాపర్ కేన్ వెస్ట్ తో డేటింగ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











