twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కిమ్ కర్దాషియానా మజాకా? కళ్లు చెదిరేలా బిజినెస్.. భారీ డీల్‌తో ఎంతంటే!

    |

    హాలీవుడ్ నటి, రియాలిటీ షో హోస్ట్ కిమ్ కర్దాషియాన్ వెస్ట్ కళ్లు చెదిరే విధంగా భారీ డీల్‌తో తన వాటాను అమ్ముకోవడం హాలీవుడ్ చిత్రపరిశ్రమలో చర్చనీయాంవమైంది. మూడేళ్ల క్రితం స్థాపించిన తన బ్యూటీ బ్రాండ్ బిజినెస్ విలువ తక్కువ కాలంలోనే 1 బిలియన్ డాలర్లకు చేరుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. తాజాగా తన వ్యాపారంలో కొంత వాటాను అమ్మకానికి పెట్టగా భారీ మొత్తం ధర పలకడం గమనార్హం. తాజాగా అమ్మిన వాటా ఎంత మొత్తాన్ని తన అకౌంట్‌లోకి తెచ్చిపెట్టిందంటే..

    20 శాతం వాటా అమ్మకంతో

    20 శాతం వాటా అమ్మకంతో

    అంతర్జాతీయ మార్కెట్ కిమ్ కర్దాషియాన్ బ్రాండ్ కేకేడబ్ల్యూ బ్యూటీకి మంచి బ్రాండ్ వ్యాల్యూ, ఆదరణ ఉంది. తన బ్రాండ్‌కు సంబంధించిన వ్యాపారంలోని 20 శాతం వాటాను అమ్మకానికి పెట్టగా కవర్‌గర్ల్ ఓనర్ కోటీ ఇంక్ సొంతం చేసుకొన్నది. దాదాపు 200 మిలియన్ల డాలర్లకు విలువ మేరకు కోటీ వాటాను దక్కించుకోవడం విశేషం.

    2017లో బ్యూటీ బ్రాండ్ ప్రారంభం

    2017లో బ్యూటీ బ్రాండ్ ప్రారంభం


    రియాలిటీ షోలతో అదరగొట్టే కిమ్ కర్దాషియాన్ 2017లో కేకేడబ్ల్యూ బ్యూటీ బ్రాండ్‌ను ప్రారంభించారు. అతి కొద్ది రోజుల్లోనే లక్షలాది మందిని తన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ద్వారా ఆకర్షించింది. దాంతో ఆమె పేరుతో ఉన్న బ్యూటీ బ్రాండ్స్‌కు విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఇప్పటికీ ఆమె సోషల్ మీడియా ద్వారా తన ప్రొడక్ట్స్‌ను ప్రమోట్ చేయడం తెలిసిందే.

    రియల్ గ్లోబల్ ఐకాన్ అంటూ

    రియల్ గ్లోబల్ ఐకాన్ అంటూ

    భారీ డీల్ జరిగిన క్రమంలో కర్దాషియన్ పాపులారిటీ గురించి కోటి సీఈవో పీటర్ హార్ఫ్ మాట్లాడుతూ.. ఆధునిక యుగంలో కిమ్ నిజమైన గ్లోబల్ ఐకాన్ అని అన్నారు. గత ఏడాది నవంబర్‌లో జెన్నెర్‌ను కూడా ఇలాంటి ప్రశంసలతో ముంచెత్తారు. ఇక గతేడాదిలో కిమ్ కర్దాషియాన్ బ్యూటీ బ్రాండ్ వ్యాపారంలోని 51 శాతం వాటాను ఆమె సోదరి కైలీ జెన్నెర్ కొనుగోలు చేయడం తెలిసిందే.

    Recommended Video

    పెద్ద సమస్య నుంచి తప్పిచుకున్న కిమ్ కర్ధాషియాన్
    బ్యూటీ రంగంలో విస్తరణపై కొటీ ఇంక్

    బ్యూటీ రంగంలో విస్తరణపై కొటీ ఇంక్

    ప్రస్తుతం కోటి వ్యాపారస్థంస్థ తమ బిజినెస్ కార్యకలాపాలను పలు దేశాల్లోకి విస్తరించే ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రపంచవ్యాప్తంగా మహిళలను ఎక్కువగా ఆకర్షించే విధంగా బ్యూటీకి సంబంధించి పలు విభాగాల్లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నది. చర్మ సౌందర్య ప్రొడక్ట్స్, షాంపు లాంటి ప్రాడక్ట్స్‌ను తమ వ్యాపారంలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. సోషల్ మీడియాతో ఎక్కువగా టచ్‌లో ఉండే యూత్‌ను టార్గెట్ చేసుకొని బిజినెస్ ప్లాన్స్ విస్తరిస్తున్నది.

    English summary
    Kim Kardashian West sells stake worth of $200 mn in KKW Beaty. This share purchased by Coty Inc. As part of business deal, Coty CEO Peter Harf praises that Kim is a true modern day global icon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X