twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పిచ్చి పనితో తల్లి అయ్యే అవకాశం కొల్పోయిన హీరోయిన్..

    By Nageswara Rao
    |

    సోషియోలైట్ కిమ్ కర్దాషియాన్ ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె ప్రియుడు బాస్కెట్ బాల్ ప్లేయర్ క్రిస్ హాంప్రస్ నుండి కేవలం 70 రోజులు గడవక ముందే విడాకుల కోరిన విషయం అందరికి తెలిసిందే. కిమ్ కర్దాషియాన్‌కి క్రిస్ హాంప్రస్‌తో పెళ్లి రెండవది. అంతక ముందు కిమ్ వేరే బాయ్ ప్రెండ్‌తో కలసి సెక్స్ వీడియోలో పాల్గోన్న విషయం తెలిసి కూడా క్రిస్ హాంప్రస్ కిమ్‌ని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు. ఐతే హాలీవుడ్‌లో ఇదంతా సర్వసాధారణం అనుకోండి.

    ఇంతకీ అసలు విషయం ఏమిటంటే కిమ్ కర్దాషియాన్‌కి గంపెడు పిల్లల్ని కనాలని ఆశ. ఇలా పెళ్లి చేసుకోని అలా చేయడం వల్ల కిమ్ ఇంకెప్పుడు గంపెడు పిల్లల్ని కంటుందోనని అందరూ అనుకుంటున్నారు. దీంతో కిమ్ కర్దాషియాన్ ఆశలన్నీ ఆడియాశలు కావల్సిందేనని పలువురు భావిస్తున్నారు. ఈ సందర్బంలో కిమ్ కర్దాషియాన్ మాట్లాడుతూ మొదటి నుండి కూడా నేను నా తల్లిదండ్రులకు ఏమి కావాలో అదే చేయడం అలవాటుగా పెట్టుకున్నాను. మొదట్లో నాకు ఆరుగురు పిల్లల్ని కనాలని ఉండేది. ఆ తర్వాత కొంత కాలం తర్వాత నలుగురు, ముగ్గురు. ఐతే ఇప్పుడు మాత్రం మా చెల్లెలకు ఉన్న పిల్లలకు మంచి ఆంటీగా ఉండాలని అనుకుంటున్నానని అన్నారు.

    ఇప్పడున్న పరిస్దితులను బట్టి నాకు పిల్లలు వద్దనే నేను కోరుకుంటున్నానని అన్నారు. నేను కలలు కన్న జీవితం మరో వైపుకి సాగుతుందని నేను భావనిస్తున్నాను. ఏది ఏమైనా నా జీవితంలో జరిగిన ఈ సమూల మార్పులన్నింటిని మనస్పూర్తింగా స్వీకరిస్తున్నానని తెలిపారు.

    English summary
    Socialite Kim Kardashian fears that she will never have children after her divorce with basketball star husband Kris Humphries. Kardashian always dreamt of having many children but now it seems like all her dreams have shattered.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X