ఫోటో తో రూమర్స్ కు చెక్ పెట్టిన బ్యూటీ
అమెరికన్ బ్యూటీ కిమ్ కర్దషియన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. వయసు పెరుగుతున్న కొద్దీ, గ్లామర్ డోస్ ను భారీగా పెంచేస్తున్న ఈ అమ్మడు నిత్యం వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ గా మారుతోంది. హాటు ఘాటు ఫొటోషూట్ లతో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్న కిమ్, భర్త కు విడాకులు ఇవ్వబోతుందని గతకొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ పుకార్లకు చెక్ పెడుతూ .. తన భర్త, పిల్లలతో కలిసి సంతోషంగా ఉన్న ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది కిమ్.
2016 నుంచి కేన్ బైపోలార్ అనే డిజార్డర్‌తో పోరాడుతున్నాడు. ఈ ఏడాది జూలైలో, అతను అధ్యక్ష పదవికి ప్రచారం చేస్తున్నప్పుడు తనకు బైపోలార్ డిజార్డర్ ఉన్నట్లు తెలిసింది. ఇటీవలే తన పెద్ద కుమార్తె నార్త్ వెస్ట్ ను చంపేస్తానని , తనను దూరంగా తీసుకెళ్లండి అని రాసుకొచ్చాడు.

దాని తర్వాత కిమ్ కర్దషియన్ తన భర్తనుంచి విడాకులు తీసుకోనుందని వార్తలు పుట్టుకొచ్చాయి. అలా పుకార్లు సృష్టించే వారి నోరు మూయించడానికి కిమ్ తన సోషల్ మీడియాలో భర్త, కూతురు నార్త్ వెస్ట్ , కుమారుడు సెయింట్ వెస్ట్ తో కలిసి సంతోషంగా ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. దీంతో అమ్మడి విడాకుల రూమర్లకు చెక్ పడింది.


Click it and Unblock the Notifications











