'అందమైన అక్క'కి బాయ్‌ప్రెండ్‌ని వెతికే పనిలో చెల్లెళ్లు
ప్రేమించి పెళ్లి చేసుకోని 72 రోజులు గడవక ముందే తన భర్త బాస్కెట్ బాల్ ప్లేయర్ క్రిస్ హాంప్రస్ నుండి విడాకులు తీసుకున్న రియాలిటీ టీవి స్టార్ కిమ్ కర్దాషియాన్ ఇప్పుడు డేటింగ్ చేసేందుకు గాను లాయల్ లేదా బిజినెస్ మ్యాన్ కోసం వెతుకులాట ప్రారంభించిందని హాలీవుడ్ వర్గాల సమాచారం. 31 సంవత్సరాల వయసు కలిగిన కిమ్ కర్దాషియాన్ తన భర్త నుండి విడాకులు తీసుకున్న తర్వాత సింగల్‌గా జీవిస్తున్న విషయం తెలిసిందే. కర్దాషియాన్ సిస్టర్సైన కోల్ కర్దాషియాన్, కోర్ట్నీ కర్దాషియాన్ ఇద్దరూ అక్క సింగల్‌గా జీవించడం చూసి ఇష్టం లేక అక్క కిమ్ కోసం బాయ్ ప్రెండ్‌ని వెతకడం ప్రారంభించారు.
ఇందుకోసం కోల్ కర్దాషియాన్ డల్లాస్‌లో మకాం వేసింది. డల్లాస్‌లో తనకి ఎవరూ తెలిసిన వారు లేకపోయినప్పటికీ... కోర్ట్నీ గురించి నాకు చిన్నప్పటి నుండి బాగా తెలుసు కాబట్టి నాకు చూడబోయే బాయ్ ప్రెండ్ విషయంలో తనని పూర్తిగా నమ్ముతున్నానని కిమ్ తెలిపింది. అంతే కాదు నాకు కోర్ట్నీ లాయర్ లేదా బిజినెస్ మ్యాన్‌లను తెస్తుందో వేచి చూద్దామని ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపింది.
'కీపింగ్ అప్ విత్ కర్దాషియాన్స్' రియాలిటీ షో ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు కర్దాషియాన్ సిస్టర్సైనటువంటి కిమ్ కర్దాషియాన్, కోర్ట్నీ కర్దాషియాన్, కోల్ కర్దాషియాన్. ఈ ముగ్గరు కలసి ఇటీవల కాలంలో డెనిమ్ జీన్స్‌కి చేసిన క్యాంపెయిన్ హాలీవుడ్‌లో అందరి నోటా చర్చ జరుగుతుంది. అందుకు కారణం డెనిమ్ జీన్స్ క్యాంపెయిన్‌లో ముగ్గురు కూడా టాప్ లెస్‌గా ఫోజు లిచ్చారు.


Click it and Unblock the Notifications











