విడాకుల కోసం భర్తపై పిటిషన్ వేసిన సూపర్ మోడల్
సూపర్ మోడల్ హైదీ క్లూమ్ భర్త సీన్ తన భార్య నుండి విడిపోతున్నట్లు అధికారకంగా ట్విట్టర్లో ప్రకటించి మూడు నెలలు పూర్తి కావస్తున్నప్పటికీ.. ఇప్పటి వరకు తన అభిప్రాయాన్ని తెలుపని ఈ సూపర్ మోడల్ ఇప్పుడు భర్త సీల్ నుండి విడాకులు కావాలని అధికారకంగా విడాకుల కొసం ఫైల్ చేసింది. హైదీ క్లూమ్ లాస్ ఏంజిల్స్‌లో ఉన్న సుపీరియర్ కోర్టులో తన భర్త నుండి విడాకులు కోరుతూ పిటిషన్‌ని ధరఖాస్తు చేసింది.
ప్రేమించి పెళ్లి చేసుకోని ఏడు సంవత్సరాలుగా కలసి సహాజీవనం సాగించిన ఈ జంటకు నలుగురు పిల్లలు లెని (7), హెన్రీ(6), జోహాన్(5), లౌ (2). హైదీ క్లూమ్ ఈ పిటిషన్‌లో తన భర్త నుండి విడాకులను కోరుతూ తన నలుగురు పిల్లల యొక్క ప్రాథమిక భౌతిక అదుపు తనకే చెందాలని పిటిషన్‌లో పేర్కోంది.
హైదీ క్లూమ్, ఆమె భర్త సీల్ ఇద్దరూ త్వరలో విడాకులు తీసుకోనునట్లు విషయం తెలుసుకున్న హైదీ క్లూమ్ తండ్రి గున్థెర్ క్లూమ్ తన విచారాన్ని వ్యక్తం చేశాడు. ఇటీవల ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో గున్థెర్ క్లూమ్ మాట్లాడుతూ ఏడు సంవత్సరాలు కలసి జీవించిన ఈ జంట హాఠాత్తుగా విడిపోతున్నట్లు ప్రకటించడంతో తాను షాక్‌కి గురి అయ్యాయని అన్నారు. ఈ విషయంపై నేను, నా భార్య చాలా విచారంగా ఉన్నామని అన్నారు.


Click it and Unblock the Notifications











