twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాబోయే భర్తతో కలిసి పనిచేయడం 'లవ్లీ' గా ఉంది..: కైరా నైట్లీ

    By Nageswara Rao
    |

    లండన్, జులై 14: బ్రిటిష్ నటి కైరా నైట్లీ తన కాబోయే భర్త జేమ్స్ రింగ్టన్‌తో కలిసి పని చేయడం "లవ్లీ" గా ఉంటుందని అన్నారు. 27 సంవత్సరాల వయసు కలిగిన కైరా నైట్లీకి మరియు జేమ్స్ రింగ్టన్‌ ఇద్దరికి మే నెలలో ఎంగేజ్‌మెంట్ అయింది. వీరిద్దరూ కలిసి ప్రస్తుతం 'సీకింగ్ ఎ ప్రెండ్ ఫర్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్' అనే సినిమాలో నటిస్తున్నారు.

    ఈ సినిమాలో వీరితో పాటు కోస్టార్ స్టీవ్ కార్రెల్ అతని భార్య నాన్సీ ఇద్దరూ కలిసి సెట్‌లో హాల్ చల్ చేస్తుంటారు. కైరా నైట్లీ మాట్లాడుతూ నాకు కాబోయే పాట్నర్ జేమ్స్ రింగ్టన్‌తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గతంలో ఎన్నడూ నేను జేమ్స్‌తో కలిసి పని చేయలేదు. కానీ మా ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత ఒకే చిత్రంలో ఇద్దరం కలిసి పని చేయడం చాలా నాలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పింది.

    బెండ్ ఇట్ లైక్ బెకహాం, ఫైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ సినిమాల ద్వారా ఫ్యామిలీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కైరా నైట్లీ కొత్తగా నటించిన 'డేంజరస్ మెధడ్' సినిమాలో పాత్రకు అభిమానులు ఖంగుతిన్నారు. 'డేంజరస్ మెధడ్' సినిమాలో కైరా నైట్లీ సెక్స్ - ఆహారం కోసం పరితపించిపోయే మానసిక రోగి పాత్రను పోషించింది. ఈ సినిమాలో నటించిన కీలకమైన సెక్స్ సీన్లలలో తాను ఆల్కహాల్ సేవించడం జరిగిందని ఇటీవల ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపింది.

    కైరా నైట్లీ షూటింగ్‌కి ముందు వోడ్కా తీసుకోవడం, సీన్స్ అన్ని బాగా వచ్చిన తర్వాత తాను ప్రవర్తించే తీరు తనకే ఆశ్యర్యాన్ని కలగజేసిందని అన్నారు. కల్చర్ మ్యాగజైన్‌తో నైట్లీ మాట్లాడుతూ ఈ సినిమాలో రెండు షాట్స్‌ని వోడ్కా సేవించి నటించానని అన్నారు.

    తెలుగు వన్ఇండియా

    English summary
    British actress Keira Knightley thinks it would be “lovely” to work with her fiance James Righton.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X