లైఫ్ స్టోరీని డాక్యుమెంటరీ నిర్మించనున్న సూపర్ సింగర్
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ సింగర్ బెవన్స్ నోవ్లెస్ తన లైఫ్ స్టోరీని ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్‌గా రూపొందించాలని సన్నాహాలు చేస్తుంది. తన జీవితం ఆధారంగా తీస్తున్న ఈ డాక్యుమెంటరీలో బెవన్స్ నోవ్లెస్ స్వయంగా నటించడమే కాకుండా తానే దర్శకత్వం వహిస్తుంది. 30 సంవత్సరాల వయసు కలిగిన బెవన్స్ నోవ్లెస్ ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్‌కి నిర్మాతగా కూడా వ్యవహారించున్నారు.
ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ని బెవన్స్ నోవ్లెస్ ఎంటర్టైన్మెంట్ ప్రధానాంశంగా రూపొందించనుంది. హాలీవుడ్‌లో పాపులర్ సింగర్సైన కాటి పెర్రీ, జస్టిన్ బైబర్ లను ఫాలో అవుతూ బెవన్స్ నోవ్లెస్ సంగీత కచేరీలు, ఇంటర్యూల ద్వారా అభిమానులకు చేరవ అవుతుంది. గతంలో బెవన్స్ నోవ్లెస్ "Beyonce: Year of 4″ పేరుతో రూపొందించిన మిని డాక్యుమెంటరీ ఫిల్మ్ 2011లో ఎమ్‌టివిలో ప్రసారమైన విషయం తెలిసిందే.
బెవన్స్ నోవ్లెస్ ఎపిక్ చిత్రంలో క్వీన్ తార అనే పాత్రకు స్వరాన్ని ఇచ్చింది. ఈ ప్రాజెక్టులో బేయోన్స్ నోలెస్‌తో పాటు కోలిన్ ఫర్రేల్, అమంద సేప్రెండ్, జానీ నాక్స్విల్లే, జాసన్ సూడైకిస్, స్టీవెన్ టైలర్ మరియు జోష్ హుచర్సేన్‌లు ఉన్నారు. గతంలో 'ఐసి ఏజ్' చిత్రాలను నిర్మించిన క్రిస్ వెడ్జ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కథ విషయానికి వస్తే ఒక వయసులో ఉన్న అమ్మాయి తనకు తాను తెలియకుండా ఒక రహస్య విశ్వం లోకి పడిపోవడం, ఆ తర్వాత ప్రత్యేక గ్రూప్ సహాయంతో ప్రపంచాన్ని ఏవిధంగా రక్షిస్తారనే ముఖ్య కథాంశంగా సాగుతుంది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











