For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మంచి హీరోయిన్ ఐతే సరిపోదు మంచి తల్లి కూడా కావాలి

  By Nageswara Rao
  |

  బ్రాడ్ పిట్, ఏంజిలినా జోలీ ఏది చేసినా అందులో ఓ ప్రత్యేకతను చాటుకుంటారు. ప్రస్తుతం బ్రాడ్ పిట్ వరల్డ్ వార్ జడ్ అనే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఏంజిలినా జోలీ మాత్రం తన ఆరుగురు పిల్లలతో రిచ్ మండ్ రొడ్ లోని తన ఇంట్లో ఉంటున్నారు. అంతేకాకుండా ఇంట్లో ఖాలీగా ఉండకుంటా ఏంజిలినా జోలీ తన ఆరుగురు పిల్లలతో వివిధ టూర్లు, విదేశీయాత్రలు అంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు. దీనికి నేనోక చిన్న ఉదాహారణ చెబుతాను.

  ఏంజిలినా జోలీ రిచ్ మండ్ రోడ్‌లో ఉన్నటువంటి పొట్రీ కేఫ్‌లో జరుగుతున్న పెయింటింగ్ పోటీలను చూడడానికి తన పిల్లలను కూడా తీసుకొని వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా తన పిల్లలకు చెప్పగానే వారంతా కూడా మేము కూడా సై అంటా తలూపారు. ఇంకెందుకు మరి ఆలస్యం అనుకున్నారో ఏమో గానీ తన కవల పిల్లలు మాత్రం హుటాహుటిని రడీ అవ్వడం జరిగింది.

  మూడు సంవత్సరాల వయసు కలిగినటువంటి కవల పిల్లలు నాక్స్, వివిన్నీ ఇద్దరూ కూడా పొట్రీ కేఫ్ యొక్క ఉత్సాహాన్ని దృష్టిలో పెట్టుకోని సమ్మర్ హాలిడే ధీమ్ అయిన పైరేట్స్‌గా ఒకరు అలంకరించుకోగా మరోకరు అచ్చం రాజకుమారిలా తయారై వెళ్లారు. ప్రక్క చిత్రంలో వారిని మీరు గమనించవచ్చు. ఈ సందర్బంలో పొట్రీ కేఫ్ యజమాని మాట్లాడుతూ వారు ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. వారు మళ్లీ మళ్లీ ఇక్కడకి రావాలని కొరుకుంటున్నాం అని అన్నారు.

  కవలలో ఒకరైన వివిన్నీ రాజకుమారి మాదిరి కాళ్లకు ఎర్రని చెప్పులు ధరించి, తెల్లని గౌనులో రాగా, అదే నాక్స్ మాత్రం తలపై పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ సినిమాలో కెప్టెన్ జాక్ స్పోరో ధరించేటటువంటి తలపాగా ధరించడంతో అక్కడున్న ఏంజిలినా జోలీ అభిమానులు అంతా చాలా సంతోషానికి లోనయ్యారు. ఇది ఇలా ఉండే జోలీ మొదటి కూతురు షైలో మాత్రం ఎవరి సహాయం లేకుండా తనంతట తానుగా బట్టలు సంచిలో పెట్టుకోని ట్రిప్‌కి సిద్దం అవ్వడంతో జోలీ చాలా సంతోషించింది. ఇదే పొట్రీ కేఫ్‌కి ఏంజిలినా జోలీ బ్లాక్ డ్రస్సుని ధరించి నలుపు కళ్లజోడుతో అభిమానులను ఆనంద పరచారు.

  ఇలా సినిమాల్లో బిజీగా గడిపేటటువంటి జోలీ అప్పుడప్పుడు తన పిల్లలకు కూడా చాలా టైమ్ కేటాయిస్తూ మంచి తల్లిగా కూడా కీర్తింపబడుతున్నారు. ఇంతకు మించి ఒక తల్లికి ఇంక ఏమి కావాలి..

  English summary
  Angelina has been doing her utmost to keep her six children occupied during the summer with various excursions. Today, Hollywood actress Angelina decided to take her family to Richmond's Pottery Cafe for an artistic afternoon of painting.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more