రెండవ బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్దమైన స్టార్
రియాలిటీ టివి స్టార్ కొర్ట్నీ కర్దాషియాన్ త్వరలో రెండవ బిడ్డకు జన్మనివ్వడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. గతంలో తన భర్త స్కాట్ డిసిక్ ద్వారా మొదటి బిడ్డకు జన్మనిచ్చిన కొర్ట్నీ కర్దాషియాన్ రియాలిటీ టివీ షో కర్దాషియాన్ సిస్టర్స్ ద్వారా యావత్ ప్రపంచం మొత్తం అభిమానులను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంలో కోర్ట్నీ కర్దాషియాన్ మాట్లాడుతూ మాకు పుట్టబోయే రెండవ బిడ్డకు సంబంధించిన విషయం మీడియాకు తెలిపేందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు జీవితంలో మళ్లీ రావాలని కొరుకుంటున్నానని అన్నారు.
2009వ సంవత్సరంలో కోర్ట్నీ కర్దాషియాన్ తన మొదటి బిడ్డకు జన్మనివ్వడం జరిగింది. ఇంతకీ కోర్ట్నీ కర్దాషియాన్ ఎవరూ అని అనుకుంటున్నారా.. ఇటీవల కాలంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న కిమ్ కర్దాషియాన్ చెల్లెలు. కిమ్ కర్దాషియాన్ తను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న బాస్కెట్ బాల్ ప్లేయర్ క్రిస్ హాంప్రస్ నుండి పెళ్లై 72 రోజులు గడవక ముందే విడాకులు కోరిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం కిమ్ కర్దాషియాన్ జీవితంలో తీసుకున్న అత్యంత కఠినమైన నిర్ణయంగా భావిస్తున్నానని అన్నారు.


Click it and Unblock the Notifications











