»   » న్యూడ్ వీడియో: ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు

న్యూడ్ వీడియో: ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: అమెరికన్ రియాల్టీ టీవీ స్టార్ క్రిస్ జెన్నర్‌ ను హ్యాకర్లు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తమకు డబ్బు ఇవ్వాలని, లేక పోతే బట్టలు మార్చుకుంటుండగా తీసిన న్యూడ్ వీడియోను లీక్ చేస్తామని బెదిరిస్తున్నారు. క్రిస్ జెన్నర్ ఐ క్లౌడ్ అకౌంట్ హ్యాక్ చేయడం ద్వారా ఇంట్లో సెక్యూరిటీ కెమెరాల్లో రికార్డయిన సదరు వీడియోలను దొంగిలించారు హ్యాకర్లు.

59 ఏళ్ల టీవీ స్టార్ సదరు వీడియో బయటకు లీక్ అయితే తన పరువు పోతుందని భాధ పడుతోంది. హ్యాకర్లు ఇంత పని చేస్తారని తాను ఊహించలేదని అంటోంది. ఈ విషయాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చింది. అయితే ఈ విషయంలో పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం, హ్యాకర్లు ఏమీ చేయలేరంటూ ఆమె కూతుర్లు కిమ్ కర్ధాషియా, ఖ్లో కర్ధాషియాన్ ఆమెకు ధైర్యం.

Kris Jenner Blackmailed Over Nude Tape

ఈ విషయంలో అమ్మ అనవసర ఆందోళన చెందుతోంది. ఆమె ఒక టీవీ స్టార్. హ్యాకర్లు తన వీడియో లీక్ చేస్తారని ఎక్కువగా భయ పడుతోంది. ఆ వీడియో లీక్ కాకుండా మేం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటున్నాం అని క్రిస్ జెన్నర్ కూతర్లు అంటున్నారు. తాజా సంఘటన నేపథ్యంలో ఇక ముందు ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటానని.....సెక్యూరిటీ విషయంలో అప్రమత్తంగా ఉంటానని అంటోంది క్రిస్ జెన్నర్.

English summary
Reality TV star Kris Jenner is being blackmailed over a nude video, showing her changing clothes in her closet.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu