For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రియుడు చీ కొట్టాడు.... అయినా పక్కనే చేరిన హీరోయిన్!

    By Bojja Kumar
    |

    లండన్: హాలీవుడ్ అందగాడిగా పేరుగాంచిన రాబర్ట్ ప్యాటిన్సన్, క్రిస్టినా స్టివార్ట్ మాజీ లవర్స్ అనే సంగతి తెలిసిందే. 26 సంవత్సరాల వయసు కలిగిన రాబర్ట్ ప్యాటిన్సన్, క్రిస్టినా స్టివార్ట్ ఇద్దరూ 2008లో ట్విలైట్ సినిమా కలిసి నటించిన తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి అప్పటి నుండి 2012 జూన్ వరకు డేటింగ్‌లో మునిగి తేలారు. ఐతే ఇటీవల క్రిస్టినా స్టివార్ట్ 'స్నో వైట్ అండ్ ద హంట్స్ మ్యాన్' సినిమా దర్శకుడు రూపెర్ట్ సాండర్స్‌తో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరిపోవడంతో వీరిద్దరూ విడిపోయారు.

    తాజాగా క్రిస్టినా స్టివార్ట్ తన మాజీ ప్రియుడు రాబర్ట్ ప్యాటిన్సన్ ఇంటికి దగ్గర్లోనే కొత్త ఇల్లు కొనుగోలు చేయడం చర్చనీయాంశం అయింది. ఆమె కొనుగోలు చేసిన ఇంటి ఖరీదు 2.195 యూఎస్ డాలర్స్. రాబర్ట్ ప్యాటిన్సన్ ఇంటికి కేవలం 2.4 కిలోమీటర్ల దూరంలోనే ఇది ఉంది. మళ్లీ పాత ప్రియుడికి దగ్గరవ్వడానికే ఆమె ఇలా చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

    ఇతర వివరాల్లోకి వెళితే... స్నో వైట్ అండ్ ద హంట్స్ మ్యాన్ సినిమాలో క్రిస్టినా స్టివార్ట్ హీరోయిన్‌గా నటించింది. గత మూడు సంవత్సరాలుగా రాబర్ట్ ప్యాటిన్సన్, క్రిస్టినా స్టివార్ట్ ఇద్దరూ హాలీవుడ్‌లో మంచి జోడిగా పేరు తెచ్చుకోవడంతో పాటు.. ప్రఖ్యాత ట్విలైట్ సిరిస్‌లలో వీరిద్దరూ నటించడం వల్ల ఆ సినిమా బాక్సాఫీసు వసూళ్లను వసూలు చేసింది.

    ఐతే క్రిస్టినా స్టివార్ట్, రాబర్ట్ ప్యాటిన్సన్‌ని మోసం చేసిన విషయం తెలుసుకోని తనని క్షమించాల్సిందిగా రాబర్ట్ ప్యాటిన్సన్‌కు ఫోన్ చేసి సుమారు గంట సేపు మాట్లాడినట్లు ప్రముఖ మ్యాగజైన్ లుక్ ఓ కథనంగా ప్రచురించింది. తన మాజీ ప్రేయసి అంత సేపు బ్రతిమాలే సరికే రాబర్ట్ కూడా క్రిస్టినాను కలిసేందుకు ఒప్పుకున్నాడని వార్తలు వినిపించాయి.

    English summary
    Actress Kristen Stewart has reportedly purchased a USD 2.195 million home just 2.4 kilometres away from ex-boyfriend Robert Pattinson's house. The home is close to their former pad which they shared before they split in the wake of Stewart’s cheating scandal with married director Rupert Sanders, reported Daily Mail.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X