సినిమా మొత్తానికి ఆముద్దు సీనే హైలెట్‌గా నిలుస్తుందన్న హీరోయిన్
హాలీవుడ్‌లో ట్విలైట్ అనే సినిమాతో ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగారు క్రిస్టినా స్టివార్ట్. ఆతర్వాత అమె నటించినటువంటి 'న్యూ మూన్' సినిమా కూడా ట్విలైట్ మాదిరే బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేయడయే కాకుండా ఒక వారం ట్రేడ్ రిపోర్ట్ లో 'న్యూ మూన్' సినిమా టాప్ ప్లేస్ లో నిలిచిన సందర్బాలు కూడా ఉన్నాయి. అలాంటి క్రిస్టినా స్టివార్ట్ నటించినటువంటి మరో కొత్త సినిమా ది రన్‌వే ఫిబ్రవరి ఏడవ తారీఖున విడుదలవుతున్న సందర్బంలో ఈసినిమాపై క్రిస్టినా స్టివార్ట్ తన అనుభవాలను పంచుకున్నారు.
ఈసందర్బంలో క్రిస్టినా స్టివార్ట్ తన కోస్టార్ అయినటువంటి పదహారు సంవత్సరాల వయసు కలిగిన డకోటా ఫాన్నింగ్‌తో కలసి ఓ అందమైన రోమాంటిక్ ముద్దుతో ఇద్దరూ రెచ్చిపోయారని సమాచారం. సినిమా మొత్తానికి ఈముద్దు సీనే చాలా హైలెట్‌గా నిలుస్తుందని అన్నారు. ఇది మాత్రమే కాకుండా క్రిస్టినా స్టివార్ట్ సిగరెట్ తాగి ఆపోగని డకోటా ఫాన్నింగ్ ముఖం మీద ఊదేలాంటి సన్నివేశాలు కూడా చిత్రీకరించడం జరిగిందని అన్నారు.


Click it and Unblock the Notifications











