twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తల్లి దర్శకురాలు.. కూతురు అతిథి పాత్ర

    By Nageswara Rao
    |

    హాలీవుడ్ స్టార్ హీరోయిన్ క్రిస్టెన్ స్టీవర్ట్ తల్లి జూల్స్ మన్-స్టీవర్ట్ దర్శకురాలిగా తెరంగేట్రం చేస్తూ రూపొందిస్తున్న "K-11" సినిమాలో ఒక అతిధి పాత్రని పోషించేందుకు సిద్ధంగా ఉంది. 21 సంవత్సరాల వయసు కలిగిన క్రిస్టెన్ స్టివర్ట్... కరెన్ అనే కార్యదర్శి అతిధి పాత్రలో నటిస్తుంది. ఈ సందర్బంలో క్రిస్టెన్ స్టీవర్ట్ తల్లి జూల్స్ మన్-స్టీవర్ట్ మాట్లాడుతూ నా కూతురు K-11 సినిమాకు గాను ఎంతో సపోర్టివ్‌గా సహాకరిస్తుంది.

    ఈ సినిమాలో ఓ చిన్న అతధి పాత్రను పోషిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. కానీ క్రిస్టినా కొన్ని సందర్బాలలో కనిపించాల్సిన సీన్లను ప్రత్యేకంగా చిత్రీకరిస్తున్నామని అన్నారు. ఈ ప్రాజెక్టులో క్రిస్టినా మాత్రమే లీడింగ్ హీరోయిన్ కాదు.. తనతో పాటు క్రిస్టినా బ్రదర్ కెమరూన్ K-11 సినిమా ద్వారా హాలీవుడ్‌కి పరిచయం కానున్నాడని తెలిపింది.

    ట్విలైట్, న్యూమూన్ లాంటి బాక్సాఫీస్ చిత్రాల్లో నటించిన క్రిస్టినా స్టివార్ట్ తన ప్రియుడు రాబర్ట్ ప్యాటిన్సన్‌తో చేస్తున్న స్నేహాం మూడు సంవత్సరాలైన సందర్బంగా 50,000 పౌండ్ల విలువ చేసే ఒక పియానో కోనుగోలు చేసి బహుమతిగా ఇచ్చింది. క్రిస్టెన్ తన బాయ్ ప్రెండ్‌కి ఆశ్చర్యం కలిగించే బహుమతినిన ఇవ్వాలనే ఉద్దేశ్యంతో దీనిని కొనుగోలు చేసిందని క్రిస్టెన్ అధికార ప్రతినిధి తెలిపారు.

    English summary
    Actress Kristen Stewart is set to make a surprise cameo in her mother Jules Mann-Stewart’s directorial debut “K-11″.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X