జపనీస్ యానిమేషన్ సినిమాలో లీడ్ హీరోయిన్ ఛాన్స్
21 సంవత్సరాల వయసు కలిగిన క్రిస్టనా స్టివార్ట్ ట్విలైట్ సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం క్రిస్టినా స్టివార్ట్ హీరోయిన్‌గా నటించిన 'ట్విలైట్ ద బ్రేకింగ్ డాన్ పార్ట్ 1' సినిమా ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 18న విడుదలకు సిద్దమైంది. ట్విలైట్ సినిమాలో క్రిస్టివా స్టివార్ట్ పోషించిన బెల్లా స్వాన్ పాత్రను చూసి మంత్ర ముగ్దులైన వార్నర్ బ్రదర్స్ యాజమాన్యం జపనీస్ యానిమేషన్ మూవీ అకీరాలో లీడ్ రోల్ పోషించాల్సిందిగా కొరడం జరిగింది.
వార్నర్ బ్రదర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కనేడ, టూసూ అనే ప్రధాన పాత్రలు ఉంటాయి. 2019వ సంవత్సరంలో టొక్యోలో జరగనున్న న్యూక్లియర్ వార్ గురించి సినిమా ఉంటుందని సమాచారం. ఈసినిమాకి సంబంధించిన పూర్తి షూటింగ్ అంతా న్యూయార్క్ లోనే తీయడం జరగుతుందని తెలిపారు. టూసూ అనే పాత్రకు గాను మిల్లర్, ఆల్డెన్ ఎన్రిచ్‌లలో ఎవరినో ఒకరిని తీసుకొవాలని భావిస్తున్నారు.
లాస్ ఏంజిల్స్‌లో జరిగిన 'ట్విలైట్ సాగా:బ్రేకింగ్ డాన్ పార్ట్ 1' బ్లాక్ కార్పెట్ ప్రీమియర్‌లో హీరో రాబర్ట్ ప్యాట్రిసన్‌తో హాజరవ్వడం జరిగింది. ఈ సందర్బంలో క్రిస్టినా స్టివార్ట్ ఈ సినిమా విశేషాలను తెలియజేస్తూ, గతంలో మేము నటించిన ట్విలైట్ సినిమాకు ఇది కొనసాగింపుగా వస్తున్న విషయం అభిమానులకు తెలిసిందే. 'ట్విలైట్ సాగా:బ్రేకింగ్ డాన్ పార్ట్ 1' సినిమాలో అభిమానులు అందరికి ఆశ్చర్య పోయేటటువంటి సన్నివేశాలున్నాయని అన్నారు. మా ఇద్దరికి జరిగినటువంటి పెళ్లి సినిమా సన్నివేశాలు సినిమా మొత్తానికి పెద్ద హైలెట్‌గా నిలుస్తాయని అన్నారు. నిజం చెప్పాలంటే నిజ జీవితంలో పెళ్లిళ్లు ఎలా జరుగుతాయో అదే విధంగా మా పెళ్లి జరిగిందని తెలియజేశారు.


Click it and Unblock the Notifications











