అయ్యో అదే ఎంతో ఘనం..ఎక్కడ పడిపోతానో అని హడలిచచ్చాను
ట్విలైట్ స్టార్ క్రిస్టినా స్టివార్ట్ ఇటీవల జరిగిన ఆస్కార్ వేడుకల్లో నల్లటి గౌనులో దగదగ మెరిసిపోయింది. సరికొత్త డిజైనర్ గౌనులో వచ్చిన ఆమె షో ఆసాంతం చాలా ఇబ్బందిగా, భయపడుతున్నట్టు కనిపించింది. ఇది ఈ షో చూసిన వారందరూ ముక్తకంఠంతో అంగీకరించే సత్యం. ఇదే ప్రశ్న ఆమెను అడిగితే గట్టిగా నవ్వేసి అయ్యో ఆ మాత్రం వుండటానికే ఎంతో కష్టపడ్డాను. ఎక్కడ కింద పడిపోతానో అని హడలిచచ్చాను అని చెప్పుకొచ్చింది.
అంత మంది ప్రముఖుల మధ్య మాట్లాడాల్సి వచ్చినప్పుడు స్టేజీ మీద గొంతు సవరించుకుంది, ఆమెను లభామర్యాదలు సరిగా తెలియవు అనె విమర్శలు ఎదురవుతున్నందుకు బాధపడుతున్నారా అనే ప్రశ్నకు... అలాంటిదేమీ లేదు. అస్సలు మాట్లాడకుండా వచ్చుంటే కూడా ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది అని విమర్శిస్తారు. ఎంతో భయపడ్డు నేను అందరి ముందు గొంతు సవరించుకుని మాట్లాడానంటే నాకే చాలా గర్వంగా వుంది అంటూ షో చూపించని ఆత్మవిశ్వాసాన్ని మీడియా ముందు చూపించింది. ఏమాటకామాటే చెప్పాలి భయపడుతున్న, ఇబ్బందిగా వున్నా క్రిస్టినా వెయ్యి ఓల్ట్ ల బల్బులాగా వెలిగిపోయింది ఏమంటారు..!?


Click it and Unblock the Notifications











