సెక్స్, డ్రగ్స్‌కు సంబంధించిన కార్యకలాపాలే ప్రధానంగా..
లాస్ ఏంజిల్స్: ట్విలైట్ సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న 21 సంవత్సరాల వయసు కలిగిన క్రిస్టనా స్టివార్ట్ యాక్షన్, ఎడ్వెంచర్ సినిమా "Cali" లో మ్యా అనే పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాలో ఈ పాత్ర ఎక్కువగా సెక్స్, డ్రగ్స్, హాత్యలకు సంబంధించిన కార్యకలాపాలను సాగించే విధంగా ఉంటుంది.
ఈ సినిమా నిర్మాత గ్రెగ్ జె ఫ్లోర్ మాట్లాడుతూ ఈ సినిమాలో క్రిస్టనా స్టివార్ట్ రెండవ వైపు నటనా విశ్వరూపాన్ని చూస్తారని అన్నారు. క్రిస్టనా స్టివార్ట్ ఎంతో అద్బుతమైన నటన ప్రదర్శిస్తుందని కొనియాడారు. గతంలో ఆమె హీరోయిన్‌గా నటించిన 'ట్విలైట్ ద బ్రేకింగ్ డాన్ పార్ట్ 1' సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.
"Cali" సినిమాలో క్రిస్టనా స్టివార్ట్ ఇంత వరకు తన జీవితంలో చేయనటువంటి సెక్సీ రోల్‌ని చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా క్రిస్టనా స్టివార్ట్ల్ నటనలో కొత్త కోణాన్ని చూస్తామన్నారు. ఈ సినిమాకు కథని మైఖేల్ డిల్ బెర్తీ అందించగా.. ఫ్లోర్, జివ్ ఫోరేమన్ సహా నిర్మాతలుగా వ్వవహరించనున్నారు. ఈ సినిమాతో పాటు క్రిస్టనా స్టివార్ట్ మరో క్రొత్త ప్రాజెక్టు 'స్నో వైట్ అండ్ ద హంట్స్ మ్యాన్' సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారు. ఈ సినిమాలో క్రిస్టనా స్టివార్ట్ తో పాటు క్రిస్ హెమ్స్ వర్త్, ఛార్లీ థెరాన్ నటిస్తున్నారు.
అతి తక్కువ వయసులో స్టార్ డమ్ హీరోయిన్‌గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న క్రిస్టినా స్టివార్ట్ గురించి అందిరి తెలిసేలా ఇటీవల ఆమె మంచు శిల్పాన్నిమ్యూజియం మేడమ్ టుస్సాడ్స్‌లో ఆవిష్కరించారు.


Click it and Unblock the Notifications











