'MTV బెస్ట్ కిస్ అవార్డు' అందుకున్న క్రిస్టినా, రాబర్ట్
లాస్ ఏంజిల్స్, జూన్ 5: 2012 సంవత్సరానికి గాను 'ఉత్తమ మద్దు' MTV మూవీ అవార్డుని మళ్లీ క్రిస్టినా స్టివార్ట్, రాబర్ట్ ప్యాటిన్సన్ సొంతం చేసుకున్నారు. వరుసగా నాల్గవ సారి ఈ ముద్దు అవార్డుని ఈ జంట సొంతం చేసుకోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ట్విలైట్ సినిమాలలో జంటగా నటించిన వీరిద్దరూ నిజ జీవితంలో మంచి జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల వీరిద్దరూ కలిసి జంటగా నటించిన 'ది ట్విలైట్ సాగా: బ్రేకింగ్ డాన్ పార్ట్ 1' సినిమాలోని నటకు గాను ఈ అవార్డు దక్కింది.
ఈ అవార్డు కార్యక్రమానికి క్రిస్టినా స్టివార్ట్ స్వయంగా వచ్చి తీసుకోగా.. ఆమె బాయ్ ప్రెండ్ రాబర్ట్ ప్యాటిన్సన్ మాత్రం ఈ ఫంక్షన్‌కి అందుబాటులో లేకపోవడం వల్ల రాలేదు. అవార్డు అందుకున్న తర్వాత క్రిస్టినా స్టివార్ట్ మాట్లాడుతూ ట్విలైట్ సిరిస్ సినిమాలను ఆదరిస్తున్న అభిమానులకు తన ధన్యవాదాలను తెలియజేసింది.
వీరిద్దరూ కలిసి మళ్లీ ఒక సినిమాలో నటించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు ఈ సినిమాకు సంబధించిన పూర్తి స్క్రిప్ట్‌ను వీరే సొంతంగా వ్రాయనున్నారని సమాచారం. లండన్‌లో పుట్టి పెరిగి హీరో అవ్వడానికి ముందు రాబర్ట్ ప్యాటిన్సన్ ఫ్యాషన్ రంగంలో రాణించాడు. ఆ తర్వాత నటనను మొదలుపెట్టిన రాబర్ట్ ప్యాటిన్సన్ బాక్సాఫీసు రికార్డుల్ని సృష్టించిన 'హ్యారీపొట్టర్ అండ్ ద గోబ్లెట్ ఆఫ్ ఫైర్' లాంటి సినిమాలలో నటించాడు.
ఇక క్రిస్టినా స్టివార్ట్ విషయానికి వస్తే ట్విలైట్ సినిమా సిరిస్‌లలో బెల్లా స్వాన్ అనే పాత్రకు తనకు మంచి గుర్తింపు తెచ్చింది. వీటితో పాటు 2002లో పానిక్ రూమ్, 2005లో జాతురా ఆమె నటనకు కొత్త అర్దాన్ని అద్దం పడతాయి. ట్విలైట్ సెట్‌లో ఈ జంట కలిసినప్పటి నుండి వీరిద్దరి మధ్య రొమాంటిక్ రిలేషన్ షిప్ ప్రారంభమైంది. ఐతే ఏరోజు కూడా వీరి మధ్యనున్న రిలేషన్ని మాత్రం బయట పెట్టలేదు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











