మ్యాగజైన్ కవర్ పేజిపై 'బ్లాక్ బికినీ'లో....
ట్విలైట్, న్యూమూన్ సినిమాలు బాక్సాఫీస్ రికార్డుల్ని సృష్టించడంతో అందులో నటించిన క్రిస్టినా స్టివార్ట్ హాలీవుడ్లో ఓ స్టార్ హీరోయిన్ గుర్తింపుని పొందారు. ఇటీవల క్రిస్టినా స్టివార్ట్ ఎక్కడ కనిపించినా అభిమానులు ఆమెని పోగడ్తలతో ముంచెత్తున్నారు. అందుకు కారణం 21 సంవత్సరాల వయసు కలిగిన క్రిస్టినా స్టివార్ట్ 'జిక్యూ మ్యాగజైన్' లేటెస్ట్ కవర్ పేజిపై బ్లాక్ బికినీలో దర్శనం ఇచ్చారు. జిక్యూ మ్యాగజైన్ కవర్ పేజిపై క్రిస్టినా స్టివార్ట్ పుల్ మేకప్‌తో ఫోజు ఇవ్వడం జరిగింది.
క్రిస్టినా స్టివార్ట్ కేవలం తన యొక్క బాడీని ఎక్కవగా ఎక్స్ పోజ్ చేస్తూ ఇచ్చిన ఈ ఫోజు ఎక్కవ మంది విమర్శకుల అభినందలు అందుకొంది. ఈ సందర్బంలో క్రిస్టినా స్టివార్ట్ మాట్లాడుతూ నేను గతంలో స్కూల్లో చదువుకునే రోజుల్లో, ఇప్పడు సినిమాలలో నటించే సమయంలో మేకప్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొవడం జరిగిందన్నారు. ఇకపోతే క్రిస్టినా స్టివార్ట్ ఇచ్చిన ఫోజులను ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ నార్మన్ జీన్ రాయ్ తీయడం జరిగింది.
మొదట్లో ఈ షాట్స్ చూసినప్పుడు నేను అచ్చం అబ్బాయిలాగా కనిపించానని ఫీల్ అవ్వడం జరిగింది. కానీ ఈ బ్లాక్ బికినీలో నా అందాలను చూసుకుంటే నన్ను నేనే నమ్మలేకపోతున్నానని అన్నారు. క్రిస్టినా స్టివార్ట్ 1990వ సంవత్సరం ఏప్రిల్ 9న జన్మించారు. క్రిస్టినా స్టివార్ట్ మొదట్లో పలు చిత్రాలలో నటించినప్పుటికీ తనకి మాత్రం బాగా పేరు తెచ్చిన పెట్టిన సినిమా ట్విలైట్ సాగా.
ఇక 2007వ సంవత్సరంలో విడుదలైన ది మెసెంజర్స్, ద రన్ ఎవేస్, పానిక్ రూమ్ లాంటి సినిమాలతో బాక్సాఫీసు హీరోయిన్‌గా మారారు. ప్రస్తుతం తన స్కూలింగ్‌ని పూర్తి చేసిన క్రిస్టినా స్టివార్ట్ రాబోయే కాలంలో కాలేజీలో చేరి తనకు ఇష్టమైన 'సాహిత్యం' అభ్యసించాలనుందని ఇటీవలే వెల్లడించారు. దీనితోపాటు తన జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటే తన తల్లి జన్మించిన ఆస్టేలియాలో సెటిల్ అవ్వాలని కొరుకుంటున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications











