ఆ సన్నివేశం చూసిన తర్వాత నాకు మాటలు రాలేదు.....!
హాలీవుడ్ లో ఎప్పుడూ వివాదాలోకి వచ్చిన వారినే అక్కడి మనుషులు బాగా గుర్తుంచుకుంటారంట. దానితో కొంతమంది కావాలనే వివాదాలు సృష్టిస్తుంటారు. ఇటీవల కాలంలో ఎప్పుడూ వివాదాల్లోకి రాని జంట వాళ్శ అభిమానులు వారిని గుర్తుంచుకోవడం లేదనిఅనుకున్నారో ఏమో ఒక్కసారిగా వాళ్శ ప్రతాపం చూపించారు. ట్విలైట్ అనే సినిమా బాక్సాఫీస్ హిట్ అవ్వడంతో చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు మన హీరో రాబర్ట్ పాటిన్షన్. ఈ సినిమాలో తనతో కలసి నటించినటువంటి క్రిస్టెన్ స్టివార్ట్ తో ఇటీవల బహిరంగంగా రోమాన్స్ చేస్తూ దోరికిపోయాడు రాబర్ట్ పాటిన్షన్.
లాస్ ఏంజిల్స్ లో వీరిద్దరూ కలసి ఓ రోమాంటిక్ డిన్నర్ ప్లాన్ చేసుకోని మరి ఎంజాయ్ చేశారని సమాచారం. డిన్నర్ ముగించిన తర్వాత ఇద్దరూ కలసి సోహా హౌస్ లోకి వెళ్శారని అక్కడున్న వారు వివరించారు. తర్వాత రాబర్ట్ పాటిన్షన్ మరియు క్రిస్టెన్ స్టివార్ట్ ఇద్దరూ చాలా సేపు అక్కడ కబుర్లు చెప్పకుంటున్న సమయంలో క్రిస్టెన్ స్టివార్ట్ వెళ్శి రాబర్ట్ పాటిన్షన్ ఒడిలో కూర్చోవడం జరిగిందంట. ఇదంతా చూసినటువంటి సాక్షి దీనిపై స్పందించడానికి తనకి మాటలు రావడం లేదన్నారు. ఇది తెలిసిన చాలా మంది వీరిద్దరి సంబంధం గురించి త్వరలో వీళ్లే బయటపడతారని అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











