ఫోర్బ్స్: అత్యధిక పారితోషకం పొందుతున్న నటిగా క్రిస్టినా
లాస్ ఏంజిల్స్: ప్రపంచంలో అత్యధిక సంపాదనను ఆర్జించే స్టార్ హీరోయిన్‌గా హాలీవుడ్ హీరోయిన్ క్రిస్టిన్ స్టివార్ట్ మొదటి స్దానాన్ని కైవసం చేసుకుంది. క్రిస్టినా స్టివార్ట్ గతయేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం వార్షిక ఆదాయం £22mగా ఉందని ప్రముఖ ఫోర్బ్స్ మ్యాగజైన తన నివేదికలో పేర్కొంది. క్రిస్టినా స్టివార్ట్ నటించిన హాలీవుడ్ బంఫర్ బాక్సాఫీసు సినిమాలైన ట్విలైట్ సిరిస్‌లలో నటించినందుకు గాను దాదాపు £8m వరకు పారితోషకం తీసుకుందని సమాచారం.
ఇటీవల క్రిస్టినా స్టివార్ట్ నటించిన స్నో వైట్ అండ్ ద హాంట్స్ మ్యాన్ సినిమా బాక్సాఫీసు విజయాన్ని నమోదు చేసింది. సినిమాల ద్వారా ఎక్కువ మొత్తం ఆమె ఆర్జిస్తుండగా.. మిగిలిన సంపాదన ఎండార్స్ మెంట్స్ మరియు ఎడ్వర్టైజింగ్‌ల ద్వారా తన ఎకౌంట్‌కు వస్తుందని తెలిపింది. క్రిస్టినా స్టివార్ట్ తర్వాత రెండవ స్దానాన్ని£21.5m సంపాదనతో కామెరాన్ డియాజ్ సొంతం చేసుకుంది. మూడవ స్దానాన్ని £16m సంపాదనతో ఆస్కార్ విన్నింగ్ హీరోయిన్ సాంద్రా బుల్లక్ సొంతం చేసుకున్నారు.
నాల్గవ స్దానంలో హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏంజిలీనా జోలీ £12.7mలతో ఉండగా.. ఐదవ స్దానంలో ప్రోమోతిస్ హీరోయిన్ చార్లెజ్ థెరాన్ £11.5mతో ఉన్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం ఉత్తమ-చెల్లింపు నటీమణులు వరుసగా...
1. క్రిస్టినా స్టివార్ట్ - £ 22m
2. కామెరాన్ డియాజ్ - £ 21.5m
3. సాంద్ర బుల్లాక్కు - £ 16m
4. ఏంజెలీనా జోలీ - £ 12.7m
5. చార్లెజ్ థెరాన్ - £ 11.5m
6. జూలియా రాబర్ట్స్ - £ 10.2m
7. సారా జెస్సికా పార్కర్ - £ 19.5m
8. మెరిల్ స్ట్రీప్ - £ 7.6m
9. క్రిస్టెన్ విగ్ - £ 7.6m
10. జెన్నిఫర్ అనిస్టన్ - £ 7m
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్లో అత్యధిక డబ్బుని సంపాదిస్తున్న జాబితాను ప్రముఖ 'ఫోర్బ్స్' మ్యాగజైన్ వెలువరించింది. ఇందులో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మొదటి స్దానాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











