ఆరు నెలలు డేటింగ్.. ఆ తర్వాత విడిపోయారు..!
లండన్: హాలీవుడ్‌లో బాక్సాఫీసు కాసుల వర్షాన్ని కురిపించిన 'సెక్స్ అండ్ ద సిటీ' సినిమా స్టార్ హీరోయిన్ క్రిస్టిన్ డేవిస్, నిర్మాత ఆరాన్ సోర్కిన్ నుండి విడిపోయింది. 47 సంవత్సరాల వయసు కలిగిన క్రిస్టిన్ డేవిస్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. గత మే నెల నుండి వీరిద్దరూ డేటింగ్ ఉండగా.. కొన్ని అని వార్య కారణాల వల్ల నిజ జీవితంలో ఇద్దరూ వివిధ విషయాలలో రాజీ పడకపోవడం వల్ల విడిపోతున్నారు.
వీరిద్దరూ వేరు వేరు వ్యక్తిత్వాలు కలిగిన మనుషులు. ప్రస్తుతం క్రిస్టిన్ డేవిస్ తన కూతురు జెమ్మా బాగోగులు చూసుకుంటుంది. వీరిద్దరూ విడిపోయినప్పటికీ.. స్నేహితులుగా మాత్రం ఉండనున్నారు. జూన్‌లో వీరిద్దరూ కలిసి 'ది న్యూస్ రూమ్' అనే షో కోసం మొట్టమొదటి సారి రెడ్ కార్పెట్‌పై దర్శమిచ్చారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











