twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ' కుంగ్‌ ఫూ పాండా-3' చైనా దాకా వచ్చింది

    By Srikanya
    |

    లాస్ ఏంజిల్స్ : ఈ రోజున ప్రపంచంలో కుంగ్ ఫూ పాండా గురంచి తెలియని చిన్నారులు అరుదనే చెప్పాలి. చిత్రమైన ఫన్నీ ఆకారంతో మురిపించే ఈ పాండా అందరి మన్ననలూ పొందింది.

    చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిని అలరించిన యానిమేషన్‌ చిత్రం కుంగ్‌ఫూ పాండా. కుంగ్‌ఫూ పాండా, కుంగ్‌ఫూ పాండా-2 చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకులను అలరించాయి. ఈ సిరీస్‌లోనే తాజాగా కుంగ్‌ ఫూ పాండా-3 వస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ ఇటీవల విడుదలైంది. అయితే ఆ ట్రైలర్ ని తొలిగించారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఈ ట్రైలర్‌ చైనీస్‌ భాషలో ఉన్నా ప్రేక్షకులను ఇందులోని కొత్త పాత్రలు ఆకట్టుకుంటాయి. ట్రైలర్‌లో ముందుగా మాస్టర్‌ షీఫెల్‌ రాబోయే యుద్ధం గురించి హెచ్చరిస్తుంటాడు.

    Kung Fu Panda 3 first footage lands in Chinese trailer

    మరో విలన్‌ పాత్ర కాయ్‌ మిగతా కుంగ్‌ ఫూ మాస్టర్ల నుంచి వారి శక్తులను దోచుకోవాలని చూస్తుంది. కొద్ది సేపు ఓ భవనంపై యుద్ధం జరగడం, ఆఖరికి కాయ్‌ ఓ విగ్రహంతో చైనా భవనాన్ని పడగొట్టడాన్ని ట్రైలర్‌లో ఆసక్తికరంగా చూపించారు. జనవరి 29, 2016లో ఈ చిత్రాన్ని అమెరికాలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

    కుంగ్‌ఫూ పాండా' తెరమీద చేసే విన్యాసాలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమాను అన్ని దేశాల్లోని ప్రేక్షకులూ విపరీతంగా అభిమానించారు. ఈ యానిమేషన్‌ చిత్రానికి ప్రముఖ హాలీవుడ్‌ నటులు ఆంజిలినా జోలీ, డస్టిన్‌ హాఫ్‌మాన్‌, జాకీ చాన్‌ వంటివారు డబ్బింగ్‌ చెప్తూంటారు. జాకీచాన్‌ మార్షల్‌ ఆర్ట్‌లో కామెడీ ఎలిమెంట్‌ జోడించడంతో ఫైటింగ్‌ సీన్లు మరింత ఆకట్టుకుంటుంది. సినిమా నిండా కిక్ల్‌, పంచ్‌లు, సమర్‌సాల్ట్‌లు, ధడేలని పడిపోవడాలూ, పో ఎంతో ఇమోషన్‌తో ఆకట్టుకోవడం అంతా అన్నీ వుంటాయి.

    Kung Fu Panda 3 first footage lands in Chinese trailer

    2004లో స్టీఫెన్‌ చో ‘కుంగ్‌ఫూ హసల్‌' అనే చిత్రమే ఈ కుంగ్‌ఫూ పాండా చిత్రాల సీరిస్ కు స్పూర్తినిచ్చిందంటారు. అయితే ఈ చిత్రంలోనూ ప్రతిష్టాత్మక చైనా కుంగ్‌ఫూనే చూపాలన్నది గట్టిగా నమ్మారు. దానికోసం ప్రొడక్షన్‌ డిజైనర్‌ రేమాండ్‌ జిబాక్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ టాంగ్‌ హెంగ్‌లు చాలా కాలం చైనా పెయింటింగ్స్‌, ఆర్క్‌టెక్చర్‌, కుంగ్‌ఫూ చిత్రాలు ఎంతో క్షుణ్ణంగా పరిశీలిం చారు. ఆ పరిశీలనతో తెలుసుకున్న అనేకాంశాల ఆధారంగానే ఈ యానిమేషన్‌ చిత్రాన్ని పకడ్బందీగా రూపొందించారు.

    English summary
    Kung Fu Panda 3 is set for release early next year, and a Chinese trailer gives us our first taste of the movie. kungfupandatrailer. The first trailer for Kung Fu Panda 3 has surfaced online, but it is in Chinese. So, there's a good shot you won't understand any of the dialogue, but we do get our first look at the film's main vllain Kai (aka The Collector).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X