Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆమెతో నా డేటింగ్.. అప్రతిష్ట పాలు చేసేందుకే..?
ఇటీవల హాలీవుడ్ స్టార్ హీరో ఆస్టన్ కుచర్ తన భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత స్క్రీన్ రైటర్ 'లోరెని స్కాఫారియా'తో కలసి డేటింగ్ చేస్తున్నారంటూ పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆనోటా.. ఈనోటా పాకి చివరికి ఈ వార్త ఆస్టన్ కుచర్ వద్దకు చేరగా.. ఈ రొమాంటిక్ రూమర్‌పై తనదైన శైలిలో స్పందించాడు. 33 సంవత్సరాల వయుసు కలిగిన ఆస్టన్ కుచర్ గత సంవత్సరం తన భార్య డెమి మోరి నుండి విడాకులు తీసుకున్నారు.
ఆ తర్వాత ఆస్టన్ కుచర్ 2011 క్రిస్మస్ సంబరాలను కొత్త గర్ల్ ప్రెండ్ 'లోరెని స్కాఫారియా'తో కలసి ఇటలీలో జరుపుకోవడమే కాకుండా, ఇటలీలో ఉన్న ఫేమస్ పీసా టవర్‌ని దర్శించినట్లు ఈ జంటను చూసిన సందర్శకులు చెప్పుకుంటున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలసి 'పిజ్జారియా ట్రటోరియా తోస్కానా'లో రొమాంటిక్ లంచ్ చేయడం జరిగిందని రూమర్స్ వచ్చాయి. ఈ వార్తలన్నీ కూడా నాపై బురద చల్లేందుకే పుట్టిస్తున్నారని అన్నారు. అసలు నాకు, 'లోరెని స్కాఫారియా'తో ఎటువంటి సంబంధం లేదని అన్నారు.
ఆస్టన్ కుచర్, 'లోరెని స్కాఫారియా'తో ఎటువంటి సంబంధం లేదనే విషయాన్ని తన మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేశారు. 'లోరెని స్కాఫారియా' నాకు గ్రీకు ప్రెండ్ అధాన్సియా ద్వారా పరిచయం అని అన్నారు. దయచేసి ఇలాంటి నిరాధార వార్తలను సృష్టించవద్దని అన్నారు.