twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆమెతో నా డేటింగ్.. అప్రతిష్ట పాలు చేసేందుకే..?

    By Nageswara Rao
    |

    ఇటీవల హాలీవుడ్ స్టార్ హీరో ఆస్టన్ కుచర్ తన భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత స్క్రీన్ రైటర్ 'లోరెని స్కాఫారియా'తో కలసి డేటింగ్ చేస్తున్నారంటూ పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆనోటా.. ఈనోటా పాకి చివరికి ఈ వార్త ఆస్టన్ కుచర్ వద్దకు చేరగా.. ఈ రొమాంటిక్ రూమర్‌పై తనదైన శైలిలో స్పందించాడు. 33 సంవత్సరాల వయుసు కలిగిన ఆస్టన్ కుచర్ గత సంవత్సరం తన భార్య డెమి మోరి నుండి విడాకులు తీసుకున్నారు.

    ఆ తర్వాత ఆస్టన్ కుచర్ 2011 క్రిస్‌మస్ సంబరాలను కొత్త గర్ల్ ప్రెండ్ 'లోరెని స్కాఫారియా'తో కలసి ఇటలీలో జరుపుకోవడమే కాకుండా, ఇటలీలో ఉన్న ఫేమస్ పీసా టవర్‌ని దర్శించినట్లు ఈ జంటను చూసిన సందర్శకులు చెప్పుకుంటున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలసి 'పిజ్జారియా ట్రటోరియా తోస్కానా'లో రొమాంటిక్ లంచ్ చేయడం జరిగిందని రూమర్స్ వచ్చాయి. ఈ వార్తలన్నీ కూడా నాపై బురద చల్లేందుకే పుట్టిస్తున్నారని అన్నారు. అసలు నాకు, 'లోరెని స్కాఫారియా'తో ఎటువంటి సంబంధం లేదని అన్నారు.

    ఆస్టన్ కుచర్, 'లోరెని స్కాఫారియా'తో ఎటువంటి సంబంధం లేదనే విషయాన్ని తన మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేశారు. 'లోరెని స్కాఫారియా' నాకు గ్రీకు ప్రెండ్ అధాన్సియా ద్వారా పరిచయం అని అన్నారు. దయచేసి ఇలాంటి నిరాధార వార్తలను సృష్టించవద్దని అన్నారు.

    English summary
    Actor Ashton Kutcher has denied reports that he is dating screenwriter Lorene Scafaria.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X