Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
300 మిలియన్ల మార్క్ తో ఇన్‌స్టాగ్రామ్‌లో కైలీ జెన్నర్ సంచలన రికార్డ్.. మొదటి మహిళగా, మూడో వ్యక్తిగా!
కైలీ క్రిస్టెన్ జెన్నర్ అమెరికన్ మోడల్, మహిళా వ్యాపారవేత్త కూడా. కేవలం 18 ఏళ్ళకే సౌందర్య సంస్థ కైలీ కాస్మటిక్స్ అనే సంస్తను స్థాపించి బిలినియర్‌గా మారింది. ఆమె చేసిన టీవీ షోలు ప్రేక్షకులను కూడా అలరిస్తాయి. అయితే ఆమె తాజాగా ఒక రికార్డు సాధించింది. ఆ రికార్డు ఏమిటో తెలుసుకుందామా.
మొదటి మహిళగా
ప్రముఖ అమెరికన్ నటి..పాప్ సింగర్ కిమ్ కర్దాషియన్ కు కైలీ క్రిస్టెన్ జెన్నర్ అలియాస్ కైలీ జెన్నర్ కజిన్ సిస్టర్. ఈ భామ కూడా పలు అమెరికన్ సీరియల్స్ తో పాటు కొన్ని మ్యూజిక్ ఆల్బమ్ ల్లో నటించింది. మోడల్ గా కూడా పని చేస్తోంది. సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్ లో కైలీ జెన్నర్ పోస్ట్ చేసే ఫోటోలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ మధ్య టాప్ లెస్ ఫోటోలతో, నగ్నంగా రక్తంలో ఉన్న ఫొటోలతో కూడా సోషల్ మీడియాలో సునామీ సృష్టించింది కైలీ జెన్నర్. తాజాగా ఆమె మరో ఇన్స్టాగ్రామ్ రికార్డును నెలకొల్పింది. బుధవారం, కైలీ కాస్మటిక్స్ వ్యవస్థాపకురాలు కైలీ క్రిస్టెన్ జెన్నర్ ఫోటో మరియు వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌లో 300 మిలియన్ల మంది ఫాలోవర్స్ ను సంపాదించిన మొదటి మహిళగా నిలిచారు.
ఈ జాబితాలో మూడో స్థానం
దీనితో, కైలీ ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా అనుసరించే మహిళగా నిలిచింది, గతంలో రికార్డును కలిగి ఉన్న పాప్ స్టార్ అరియానా గ్రాండేను కైలీ జెన్నర్ అధిగమించింది. అంతే కాక ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఫాలో అవుతున్న వ్యక్తుల జాబితాలో కూడా కైలీ జెన్నర్ మూడో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో అధికారిక Instagram ఖాతా ఉంది. దానికి 460 మిలియన్లు ఫాలోవర్లు ఉన్నారు. అదే సమయంలో, పోర్చుగల్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో రెండవ స్థానంలో ఉన్నాడు, అతనిని 389 మిలియన్ల మంది వినియోగదారులు అనుసరిస్తున్నారు. ఇప్పుడు 300 మిలియన్ల మంది ఫాలోవర్స్ ను సంపాదించి కైలే జెన్నర్ ఈ జాబితాలో మూడో స్థానం సాధించింది.
లో ప్రొఫైల్
కైలీ జెన్నర్ తర్వాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ (300 మిలియన్ ఫాలోవర్స్) మరియు నటుడు డ్వేన్ 'ది రాక్' జాన్సన్ (289 మిలియన్ ఫాలోవర్స్) ఉన్నారు. కైలీ జెన్నర్ తర్వాత అత్యధిక ఫాలోయింగ్ ఉన్న మహిళగా పాప్ సింగర్ అరియానా గ్రాండే నిలిచింది. కైలీ జెన్నర్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా, ఆమె తన కాస్మెటిక్ వ్యాపారమైన కైలీ కాస్మెటిక్స్‌ను కూడా ప్రమోట్ చేస్తుంది. అయితే ఎందుకో తెలియదు కానీ కైలీ జెన్నర్ చాలా కాలంగా సోషల్ మీడియాలో లో ప్రొఫైల్‌ను కొనసాగిస్తున్నప్పటికీ ఆమె ఫాలోవర్స్ మాత్రం ఆమెను ఫాలో అవుతూనే ఉన్నారు.
చిన్న వయసులోనే అనేక వ్యాపారాలు
దీనికి పెద్ద కారణం కైలీ జెన్నర్ రెండవ గర్భం. 24 ఏళ్ల కైలీ జెన్నర్ తన రెండో బిడ్డకు తల్లి కాబోతోంది. ఈ బిడ్డ ఆమె భాగస్వామి ట్రావిస్ స్కాట్ తో కలిసి కంటోంది. కైలీకి ట్రావిస్ ద్వారా స్టార్మీ వెబ్‌స్టర్ అనే కుమార్తె కూడా జన్మించింది. కైలీ జెన్నర్ కర్దాషియన్-జెన్నర్ కుటుంబంలో అతి పిన్న వయస్కురాలు అలాగే అత్యంత ధనవంతురాలు. అలాగే, కైలీ కూడా కుటుంబంలో చాలా ఫేమస్. ఆమె అక్క కిమ్ కర్దాషియాన్, రియాలిటీ టీవీ, బిజినెస్ మరియు సోషల్ మీడియా ప్రపంచంలో సుపరిచితురాలు. చిన్న వయసులోనే కైలీ జెన్నర్ అనేక వ్యాపారాలు ప్రారంభించింది. ఇందులో కైలీ సౌందర్య సాధనాలు, కైలీ స్కిన్, కైలీ స్విమ్ మరియు ఇటీవల ప్రారంభించిన కైలీ బేబీ ఉన్నాయి.
మోడమ్ మొగల్
అంటే కాదు కైలీ జెన్నర్ ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం పొందుతున్న సెలబ్రిటీ కూడా. 2020లో ఫోర్బ్స్ అత్యధికంగా సంపాదిస్తున్న ప్రముఖుల జాబితాలో కైలీ జెన్నర్ అగ్రస్థానంలో ఉన్నారు. 2021లో, కైలీ జెన్నర్ ఫోర్బ్స్ 100 మంది ధనవంతుల స్వీయ-నిర్మిత మహిళల జాబితాలో చోటు సంపాదించిన అతి పిన్న వయస్కురాలుగా నిలిచింది కైలీ జెన్నర్ నికర విలువ 700 మిలియన్ల డాలర్లు. కాగా కైలీ జెన్నర్ ను మోడమ్ మొగల్ అని అంటారు