గౌరవ డాక్టరేట్‌ని పొందిన ప్రముఖ సింగర్
హాలీవుడ్ సింగర్ కైలీ మినోగ్ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి సరైన ప్రచారం నిర్వహించినందుకు డాక్టరేట్ అవార్డుతో ఆమెని సత్కరిచండం జరిగింది. 43సంవత్సరాల వయసు కలిగిన సింగర్ కైలీ మినోగ్‌కి క్లిమ్స్ ఫోర్డ్‌లోని ఏంజిలా రస్కెన్ యూనివర్సిటీ నుండి ఈ డాక్టరేట్ అవార్డుని ప్రకటించడం జరిగింది.
ఈ సందర్బంలో కైలీ మినోగ్ మాట్లాడుతూ నా చిన్నతనం నుండి ఇప్పటి వరకు కూడా నేను యూనివర్సిటీకి వెళ్లి చదువుకోలేదు. నేను చేసినటువంటి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమోషన్ నాకు డాక్టరేట్‌ని తెచ్చిపెడుతుందని నేను అసలు ఊహించలేదని అన్నారు. నాకు డాక్టరేట్ వచ్చిన సందర్బంగా మానాన్న చాలా సంతోషానికి లోనయ్యారని అన్నారు. నేను అవార్డు తీసుకుంటున్న ఇమేజిలను చూసి మానాన్న గారు కన్నీళ్లు పెట్టుకున్నారని తెలిపారు.
ప్రజలలో చైతన్యం కలిగించేలా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రాగ్రామ్‌ని చేపడ్డం జరిగింది. సాధారణంగా చాలా మంది యువతులకు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి సరైన సమాచరం తెలియక పోవడంతో వారు దీని భారిన పడుతున్నారని అన్నారు.


Click it and Unblock the Notifications











