డ్రస్ సెన్సు లేని ఆమెకు వరల్డ్ 20 బెస్ట్ డ్రస్సెడ్ పీపుల్ లోచోటు దక్కడమా..
డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రంగాలలో ఆన్ లైన్ పోల్స్ నిర్వహించడం పరిపాటి. సంవత్సరం మొత్తంలో ఎవరు దిబెస్ట్ అని చెప్పడం కోసమే చాలా మంది ఈపోల్స్ బాగా పనికివస్తాయని అంటున్నారు. ఇటీవల కాలంలో ఫ్యాషన్ మ్యాగజైన్ వోగ్ కూడా అచ్చం ఇలాంటిదే ఓపోల్ నిర్వహించింది. ఏమిటా ఈపోల్ అని అనుకుంటున్నారా..ప్రపంచం మొత్తం లోకెల్లా ఎవరు బాగా డ్రస్సు వేసుకుంటారనేది ఈపోల్.
ఈపోల్ లో అందరికంటే మొట్టమొదటి స్దానంలో టివి ప్రెజెంటనర్ అలెక్సా చుంగ్ నిలిచారు. అదేవిధంగా పుట్ బాల్ ఆటగాడు డేవిడ్ బెకహాం భార్య్ విక్టోరియా బెకహాం కూడా టాప్ 20లో స్దానం సంపాదించారు. వీళ్శతోపాటు బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కెమరూన్ భార్య సమంతా కూడా స్దానం సంపాదించుకున్నారు. చివరగా ఎప్పుడూ చెత్త డ్రస్సులు వేసుకునేటటువంటి మన పాప్ సింగర్ లేడీగాగా కూడా స్దానం సంపాదించడంతో ఆమె అభిమానలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈఆన్ లైన్ పోల్ కి వోగ్ దినపత్రిక తన ఆమోదముద్ర తెలిపింది..


Click it and Unblock the Notifications











